విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:51 PM
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్‌లో జిల్లా స్థాయి అండర్ 11, 14 బాలురు, బాలికల 70వ ఎస్‌జిఎఫ్ కరాటే సెలక్షన్స్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
పెద్దపల్లి కల్చరల్, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్‌లో జిల్లా స్థాయి అండర్ 11, 14 బాలురు, బాలికల 70వ ఎస్‌జిఎఫ్ కరాటే సెలక్షన్స్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని, విద్యార్థుల తల్లితండ్రులు పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలనన్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ తదితర పోటీల్లో ఈ ప్రాంత విద్యార్థులు, యువకులు ఎంతో నైపుణ్యంతో రాణిస్తున్నారని చెప్పారు. ఎస్‌జిఎఫ్ రాష్ట్ర, జాతీయ క్రీడల్లోనూ సత్తా చాటి జిల్లా పేరు నిలబెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు తనవంతు సహకారం ఉంటుందని విప్ పేర్కొన్నారు. కరాటే ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.