Share News

విద్యార్థులు బాధ్యతగా వ్యవహరించాలి

ABN , Publish Date - Nov 24 , 2026 | 12:02 AM

విద్యార్థులు తమ హక్కు లను పొందుతూ సమా జంపై బాధ్యతగా వ్యవ హరించాలని జిల్లా న్యాయ సేవల అధికారి శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జూనియర్‌ కళాశాలతో పాటు మోడల్‌ స్కూల్‌లో విద్యా ర్థులకు న్యాయ సలహాలు, సూచనలు చేశారు.

విద్యార్థులు బాధ్యతగా వ్యవహరించాలి

ధర్మారం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు తమ హక్కు లను పొందుతూ సమా జంపై బాధ్యతగా వ్యవ హరించాలని జిల్లా న్యాయ సేవల అధికారి శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జూనియర్‌ కళాశాలతో పాటు మోడల్‌ స్కూల్‌లో విద్యా ర్థులకు న్యాయ సలహాలు, సూచనలు చేశారు. విద్యార్థి దశ నుంచే సమాజంలో జరుగుతున్న సంఘటనలపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అపరిచిత మొబైల్‌ కాల్స్‌, పోక్సో యాక్ట్‌, చైల్ట్‌ లేబర్‌ వంటి సామాజిక అంశాలపై బాలికలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలిసి తెలియని వయస్సులో విద్యార్థులు సమస్యల్లో చిక్కుకుని భావి జీవితాన్ని చెడ గొట్టుకోవద్దన్నారు. న్యాయపరమైన సమస్యలు ఉంటే 15100 ఉచిత టోల్‌ ఫ్రీ నంబర్‌ను సంప్రదించి పరిష్కారం పొందవచ్చని తెలిపారు. అందరికి ఉచిత న్యాయ సేవలు అందించడానికి న్యాయసేవా అధికా రులు అందుబాటులో ఉంటారని, ఈ అవకాశన్ని సద్వినియోగం చేసు కోవాలని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్‌ అనంత రామకృష్ణ, ఈరవేణి రాజ్‌కుమార్‌, లెక్షరర్స్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2026 | 12:02 AM