Share News

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి

ABN , Publish Date - Nov 27 , 2026 | 11:43 PM

ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి కల్పన సూచించారు. శుక్రవారం ఓదెల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను కల్పన సందర్శించారు. విద్యార్థులకు నిర్వహిస్తున్న మూడో యూనిట్‌ పరీక్షలను పరిశీలించారు.

 విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి

ఓదెల, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి కల్పన సూచించారు. శుక్రవారం ఓదెల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను కల్పన సందర్శించారు. విద్యార్థులకు నిర్వహిస్తున్న మూడో యూనిట్‌ పరీక్షలను పరిశీలించారు. రానున్న పబ్లిక్‌ పరీక్షలు, ప్రయోగ పరీక్షలకు విద్యార్థుల సన్న ద్ధం, ప్రావిణ్యతను తెలుసుకున్నారు ప్రయోగశాల లను సందర్శించి విద్యార్థుల ప్రాక్టికల్‌ పరిజ్ఞానం, సామర్థ్యా లను పరీక్షించారు. ఫిబ్రవరిలో జరగనున్న ఇంటర్మీ డియట్‌ పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచిం చారు. ఇంటర్మీడియట్‌ అనంతరం ఉన్నత విద్యతో పాటు అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను వివ రించారు. ఆర్వో ప్లాంట్‌ను ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ అమరేందర్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2026 | 11:43 PM