Share News

డ్ఠ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన

ABN , Publish Date - Sep 11 , 2026 | 11:52 PM

డ్రగ్స్‌ మహమ్మారి, సైబర్‌ నేరాల బారిన పడకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనిజ కోహిర్కర్‌ సూచించారు. బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

డ్ఠ్రగ్స్‌,  సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన

పెద్దపల్లి టౌన్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ మహమ్మారి, సైబర్‌ నేరాల బారిన పడకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనిజ కోహిర్కర్‌ సూచించారు. బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, డ్రగ్స్‌ అక్రమ విక్రయాలు, సైబర్‌ క్రైం ద్వారా జరిగే మోసాలు, ఆర్థిక నష్టాలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే 15100 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు విషయాన్ని తెలువచ్చన్నారు. సైబర్‌ నేరానికి గురై డబ్బులు నష్టపోయినట్లయితే ఆలస్యం చేయకుండా 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలియజేయాలని శ్రీనిజ కోహిర్కర్‌ సూచించారు. ముఖ్యంగా నేరం జరిగిన వెంటనే స్పందిస్తే నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. విద్యార్థులకు ఏవైనా న్యాయపరమైన సమస్యలు ఎదురైతే పరిష్కారానికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని తెలిపారు. డాక్టర్‌ అతుల్య, డబ్ల్యూపీసీ నాగరాణి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు యశ్వంత్‌, చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ నుచ్చు శ్రీనివాస్‌, న్యాయవాది తాని నరేష్‌, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2026 | 11:52 PM