Share News

పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల భాగస్వామ్యం తప్పనిసరి

ABN , Publish Date - Jun 11 , 2026 | 11:51 PM

పర్యా వరణ పరిరక్షణలో విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో అవసరమని ప్రాంతీయ కార్యాలయం పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అసిస్టెంట్‌ సైం టిస్ట్‌ కనకజ్యోతి అన్నారు. గురువారం జ్యోతి నగర్‌లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎన్‌సీసీ విద్యార్థులకు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.

పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల భాగస్వామ్యం తప్పనిసరి

జ్యోతినగర్‌, జూన్‌11(ఆంధ్రజ్యోతి): పర్యా వరణ పరిరక్షణలో విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో అవసరమని ప్రాంతీయ కార్యాలయం పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అసిస్టెంట్‌ సైం టిస్ట్‌ కనకజ్యోతి అన్నారు. గురువారం జ్యోతి నగర్‌లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎన్‌సీసీ విద్యార్థులకు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణానికి కలిగే హానికారక ప్రభావాలు, భూమి, నీరు, జీవ వ్యవస్థలకు వాటి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ నిత్యజీవితంలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలని, దానికి పాటిం చాల్సిన నియమాలు, అనుసరించాల్సిన ప్ర త్యామ్నయ మార్గాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులచే ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించాలని ప్రతిజ్ఞ చేయించారు.

ప్లాస్టిక్‌ స్థానంలో బయో డిగ్రేడబుల్‌ వస్తువులను వాడాలని, పర్యావరణాన్ని కాపా డుకోవాలని పిలుపునిచ్చారు. జడ్పీ ఉన్నత పాఠశాల ఎన్‌సీసీ కోఆర్డి నేటర్‌ తిరుపతి, ఎన్‌జీసీ కోఆర్డినేటర్‌ అంజన్‌ కుమార్‌, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2026 | 11:51 PM