ఏఐ, రోబోటిక్స్‌పై విద్యార్థుల ప్రదర్శన
ABN , Publish Date - May 26 , 2026 | 11:34 PM
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డిజిటల్ నైపు ణ్యాల అభివృద్ధికి నిర్వహించిన సూపర్ సమ్మర్ కంప్యూటర్ శిక్షణ ఎంతో దోహదపడిందని కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు.
పెద్దపల్లి కల్చరల్, మే26(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డిజిటల్ నైపు ణ్యాల అభివృద్ధికి నిర్వహించిన సూపర్ సమ్మర్ కంప్యూటర్ శిక్షణ ఎంతో దోహదపడిందని కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు. టీ ఫైబర్ సహకారంతో గత నెల 27 నుంచి ఈనెల 26 వరకు మంథని, పెద్దపల్లి, రామగుండం, సుల్తానాబాద్ కేంద్రాలలో మొత్తం 312 మంది ప్రభుత్వ పాఠశాల విద్యా ర్థులకు ప్రత్యేక శిక్షణ అందించినట్లు కలెక్టర్ వివరించారు. ప్రతీ కేంద్రంలో ఆరు రోజులపాటు కంప్యూటర్, ఏఐ, రోబోటిక్స్, డిజిటల్ స్కిల్స్‌పై తరగ తులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మంగళవారం ముగింపు కార్యక్ర మంలో భాగంగా కలెక్టరేట్‌లో నాలుగు ప్రాంతాల నుంచి ఎంపికైన విద్యా ర్థులు తమ ప్రాజెక్టులు వినూత్న ఆలోచనలు, డిజిటల్ స్కిల్స్ ప్రజెంటే షన్లతో ఆకట్టుకున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్ మెమోంటోలు అందించారు. అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.