ప్రజాపాలన ప్రగతికి బలమైన అడుగులు
ABN , Publish Date - May 05 , 2026 | 12:09 AM
ప్రజాపాలన ప్రగతికి బలమైన అడుగులు పడుతాయని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అన్నారు. సోమవారం ఎన్టీపీసీ కాకతీయ హాల్‌లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
జ్యోతినగర్, మే4(ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన ప్రగతికి బలమైన అడుగులు పడుతాయని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అన్నారు. సోమవారం ఎన్టీపీసీ కాకతీయ హాల్‌లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత 99 రోజుల్లో ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతపై సమీక్షించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ పథకాల పంపిణీ, భూ సంబంధిత సమస్యల పరిష్కారం, గృహ నిర్మాణ కార్యక్రమాల పురోగతి అంశాలను తెలుసుకున్నారు. ప్రతి పథకం లబ్ధిదారునికి చేరేలా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు రావాలంటే ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు బాధ్యతతో పని చేయాలన్నారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్లు, సర్పంచ్‌లు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.