మందుల కొరత లేకుండా పటిష్ట చర్యలు
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:17 AM
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన చికిత్సలు అందించాలని, అవసరమైన మందుల కొరత రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సుల్తానాబాద్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన చికిత్సలు అందించాలని, అవసరమైన మందుల కొరత రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఓపీ సేవలను పరిశీలించి డెంటల్ ఓపీకి వస్తున్న కేసులు, రోగులకు అందిస్తున్న చికిత్స వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. గర్భిణీలకు రెగ్యులర్ హెల్త్ చెక్ ఆప్ షెడ్యూల్ ప్రకారం జరిగేలా చూడాలని, అవసరమైన వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలన్నారు. అనంతరం వివిధ వార్డులను సందర్శించారు. ఆస్పత్రిలో అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎన్‌సీడీ విభాగం పరిశీలించి మందుల కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలలో వసతి సౌకర్యాలను మెరుగుపరచామని, అధునాతన పరికరాలు, నిఫుణులైన డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారన్నారు. మున్సిపల్ కమిషనర్ టి రమేష్, ఆస్పత్రి డాక్టర్లు ఆర్ ఎం ఓ తదితరులు పాల్గొన్నారు.