నీటి వనరుల పరిరక్షణకు పటిష్ట చర్యలు
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:02 AM
జిల్లాలోని నీటి వనరులను పరిరక్షిస్తూ వర్షపు నీటి బొట్టును సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధి కారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నీటిపారుదల శాఖ పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పెద్దపల్లి టౌన్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని నీటి వనరులను పరిరక్షిస్తూ వర్షపు నీటి బొట్టును సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధి కారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నీటిపారుదల శాఖ పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెరువుల కట్టలు, తూముల పటిష్టతను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. కాలువల్లో పూడిక, పిచ్చి మొక్కలు తొలగించి నీటి ప్రవా హానికి ఆటంకాలు లేకుండా చూడాలని, కాలు వల భూముల్లో ఆక్రమణలను గుర్తించి తొల గించాలని ఆదేశించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి నీటి వనరుల పరిస్థితిని పరిశీలించాలని కలెక్టర్ సూచించారు.
వర్షం నీటిని ఒడిసి పట్టేందుకే జలసిరి
పెద్దపల్లి రూరల్, (ఆంధ్రజ్యోతి) : ప్రతీ వర్షపు బొట్టును ఒడిసి పట్టేందుకు జలసిరి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని, దీని ద్వారా భూగర్భజలాలు పెరుగుతాయని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని అన్నారు. గురువారం పెద్దబొంకూర్‌లో జలసిరిలో భాగం గా చేపడుతున్న ఫాంపాండ్‌ను పరిశీలించారు. అనంతరం నర్సరీని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆమె మాట్లాడుతూ లోటు వర్షపాతం కారణంగా భవిష్యత్‌లో తాగు, సాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందన్నారు. వీబీజీరామ్‌జీ పథకం కింద కమ్యూనిటి ఇంకుడు గుంతలు, పంట కుంటలు, ఇంకుడు గుంతలు, బోరు బావుల రీఛార్జి, బావుల తవ్వకాలను చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తున్న జలసిరిని అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అమలు చేయాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ఏపీవో రమేష్‌బాబు, గ్రామ సర్పంచ్ కల్వల తిరుపతి, ఉప సర్పంచ్ వెంకటేష్, జేఈ రాజ య్య, టిఏ దివ్య, పీల్డ్ అసిస్టెంట్ మల్లీశ్వరితో పాటు వార్డు సభ్యులు పాల్గొన్నారు.