Share News

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు

ABN , Publish Date - Mar 06 , 2026 | 12:19 AM

సింగరేణిలో కార్మికుల సమస్య లను పరిష్కరించకుంటే సమ్మె తప్పదని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూని యన్‌ (ఏఐటీయూసీ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌లు పేర్కొన్నారు. గురువారం గోదావరిఖనిలో ఏఐటీయూసీ కేంద్ర కమిటీ సమావేశంలో జరిగిన వివరాలను వెల్లడిం చారు.

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు

గోదావరిఖని, మార్చి 5(ఆంధ్రజ్యోతి): సింగరేణిలో కార్మికుల సమస్య లను పరిష్కరించకుంటే సమ్మె తప్పదని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూని యన్‌ (ఏఐటీయూసీ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌లు పేర్కొన్నారు. గురువారం గోదావరిఖనిలో ఏఐటీయూసీ కేంద్ర కమిటీ సమావేశంలో జరిగిన వివరాలను వెల్లడిం చారు. సింగరేణి యాజమాన్యం స్ట్రక్చర్‌ కమిటీ సమావేశాల్లో పలు డిమాండ్‌లను అంగీకరించి అమలు చేయడం లేదని ఆరోపించారు. సొంత ఇంటి పథకాన్ని, పెర్క్స్‌పై ఇన్‌ కంటాక్స్‌ చెల్లింపులపై సర్క్యులర్‌లను జారీ చేయడం లేదన్నారు. మెడికల్‌ బోర్డును ఏసీబీ విచారణ పేరుతో నిలిపి వేశారని, కాలయాపన చేస్తూ కార్మికులను యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. విజిలెన్స్‌ కేసుల పేరుతో మారుపేర్లు డిపెండెంట్‌లకు ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. జనరల్‌ సమ్మెలో పాల్గొన్న కాంట్రాక్టు కార్మికుల నుంచి జీతం రికవరీ చేయొద్దని, వేలంతో సంబంధం లేకుండా తెలంగాణలో కొత్త గనులు సింగరేణికి కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సింగరేణి వ్యాప్తంగా ఆం దోళన చేపడతామని, లేకుంటే సమ్మెకు పిలుపునిస్తామని పేర్కొన్నారు. ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, ఉప ప్రధాన కార్యదర్శులు సారయ్య, వైవీ రావు, ముష్కె సమ్మయ్య, ఎల్లాగౌడ్‌, కే వీర భద్రం, కేంద్ర కమిటీ సభ్యులు అక్బర్‌అలీ, స్వామి, రాజారత్నం, నాయకులు బాజీ సైదా, మల్లికార్జున్‌, రాంగోపాల్‌, రమేశ్‌, తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2026 | 12:19 AM