మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
ABN , Publish Date - May 23 , 2026 | 11:56 PM
జిల్లాలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికా రులను ఆదేశించారు. శనివారం ఐడిఓసీ కార్యాలయం లో మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్య లపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లి, మే 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికా రులను ఆదేశించారు. శనివారం ఐడిఓసీ కార్యాలయం లో మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్య లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని, ఆరోగ్యంతో పాటు ఆలోచనా శక్తి కూడా దెబ్బతింటుందన్నారు. భావితరాలు డ్రగ్స్, మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండా వారికి మంచి, చెడుపై సరైన అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లలో విద్యార్థుల అలవాట్లను పర్యవేక్షించాలని, విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్, మాదకద్రవ్యాల సరఫరా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశిం చారు. డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామా లపై ప్రజల్లో అవగాహన పెంచడం తోపాటు, వాటి నియంత్ర ణకు పోలీస్, ఎక్సైజ్, విద్య, వైద్య, రెవె న్యూ, అటవీ తదితర శాఖలు సమ న్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. డీసీపీ రాంరెడ్డి, డీఎం హెచ్‌ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్, ఏసీపీ లు కృష్ణ, రమేష్, అధికారులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ బాధితులకు
సకాలంలో న్యాయం అందించాలి
ఎస్సీ, ఎస్టీ బాధితులకు చట్టం ప్రకారం సకాలంలో న్యాయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. శనివారం నిర్వ హించిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమి టీ సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల్లో బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసే పరి హారాన్ని మార్గదర్శకాల ప్రకారం నిర్దేశిత గడువులోగా విడుదల చేసి అందజేయాలని అధికారులను ఆదేశిం చారు. పరిహారానికి సంబంధించిన ఫైళ్లను ఆలస్యం చేయకుండా క్లియర్ చేయాలని సూచించారు. కమిటీ సభ్యుల విజ్ఞప్తి మేరకు ప్రతీ సివిల్ రైట్స్‌డే కార్యక్ర మానికి తహసీల్దార్, ఎస్సైలు హాజరు కావాలని ఆదే శించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, కార్పొ రేట్ కళాశాలల వంటి ప్రభుత్వ పథ కాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యావ కాశాలను పొందాలని తెలిపారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, డీసీపీ, ఏసీపీలు, ఆర్డీవోలు, డీఎస్‌డీవో రవీందర్, అధికారులు, రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధి రాజగోపాల్, పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి
రామగుండం నియోజకవర్గ పరిధిలో కొనసాగు తున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో చేపడుతున్న మెడికల్ కళాశాల నిర్మాణ పనులు, మున్సిపల్ రోడ్ల అభివృద్ధి, రెవెన్యూ శాఖ పనులు, డ్రెయినేజీ నిర్మాణాలు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖ పనులు, గృహ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించినట్లు తెలిపారు. అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులో పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆర్డీవోలు సురేష్, బి గంగయ్య, సీపీవో రవీందర్, ఇంజినీరింగ్ శాఖాధికారులు పాల్గొన్నారు.