Share News

నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:52 PM

రామగుండం పోలీస్‌ కమిషరేట్‌ పరిధిలో నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు. మంగళవారం పోలీస్‌ అధికారుల నేర సమీక్ష సమావేశం నిర్వహిచారు. నమోదైన కేసులు, పెండింగ్‌ ఉన్న పాత కేసులపై సీపీ ప్రత్యేకంగా దృష్టి సారించారు.

నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): రామగుండం పోలీస్‌ కమిషరేట్‌ పరిధిలో నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు. మంగళవారం పోలీస్‌ అధికారుల నేర సమీక్ష సమావేశం నిర్వహిచారు. నమోదైన కేసులు, పెండింగ్‌ ఉన్న పాత కేసులపై సీపీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. దర్యాప్తులో జాప్యానికి గల కారణాలను అధికారులను తెలుసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దొంగతనాల నివారణ, కేసుల ఛేదనపై సమీక్షిస్తూ, నేరస్తులను పట్టుకోవడంలో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని ఆదేశించారు. చోరీలకు పాల్పడే వ్యక్తులపై హిస్టరీ షీట్లు తెరవాలని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలు, కాలనీలు, వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేపట్టాలని సూచించారు. ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు, జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్‌, పెద్దపల్లి డీసీపీ బీ రామ్‌రెడ్డి, అడిషనల్‌ డీసీపీ (అడ్మిన్‌) కే శ్రీనివాస్‌, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్‌, మంచిర్యాల ఏసీపీ ఆర్‌ ప్రకాష్‌, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌ కుమార్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ నాగేంద్ర గౌడ్‌, ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాస్‌, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2026 | 11:52 PM