Share News

హాస్టళ్ల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు

ABN , Publish Date - Mar 28 , 2026 | 11:24 PM

సంక్షేమ హాస్టళ్ల నిర్వ హణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష తెలి పారు. శనివారం కలెక్టరేట్‌లో హాస్టల్‌ వార్డెన్‌లతో సమీక్ష నిర్వహించారు. మాట్లాడుతూ పిల్లలు భోజనం చేసే సమయంలో వార్డెన్‌లు తప్పకుండా హాస్టల్‌లో ఉండాలని, స్టడీ అవర్స్‌లో అందుబాటులో ఉండాలన్నారు.

హాస్టళ్ల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు

పెద్దపల్లి కల్చరల్‌, మార్చి28(ఆంధ్రజ్యోతి): సంక్షేమ హాస్టళ్ల నిర్వ హణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష తెలి పారు. శనివారం కలెక్టరేట్‌లో హాస్టల్‌ వార్డెన్‌లతో సమీక్ష నిర్వహించారు. మాట్లాడుతూ పిల్లలు భోజనం చేసే సమయంలో వార్డెన్‌లు తప్పకుండా హాస్టల్‌లో ఉండాలని, స్టడీ అవర్స్‌లో అందుబాటులో ఉండాలన్నారు. మార్చి నెలాఖరులోపు హాస్టళ్లకు కేటాయించిన బడ్జెట్‌ పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు ముగిసే వరకు స్టడీ అవర్స్‌ జరగాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఏప్రిల్‌ 23వ తేదీ వరకు మిగిలిన తరగతి పిల్లలకు కూడా స్టడీ అవర్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్‌, హాస్టళ్లవార్డెన్లు, అధికారులు పాల్గొన్నారు.

జిల్లాలో 1,655 కెఎల్‌ ఇంధన నిల్వలు

పెద్దపల్లి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు. ఆయిల్‌ కంపెనీల సేల్స్‌ అధికారుల నివేదికల ప్రకారం జిల్లాలోని అన్ని పెట్రోల్‌ బంకుల్లో ఇంధన సరఫరా ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతోందన్నారు. జిల్లాలో మొత్తం 108 పెట్రోల్‌ బంకులు ఉండగా, రోజువారీ సగటు విక్రయాలు 255 కిలోలీటర్లు నమోదవుతున్నాయని తెలిపారు. ఇందులో పెట్రోల్‌ 82 కిలోలీటర్లు, డీజిల్‌ 173 కిలోలీటర్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 1655 కిలోలీటర్లు ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఇందులో పెట్రోల్‌ 624, డీజిల్‌ 1031 కిలో లీటర్లు ఉన్నాయని తెలిపారు. అన్ని ఆయిల్‌ కంపెనీల ద్వారా సరఫరా సాధారణంగా కొనసాగుతోందని, ప్రజలు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా అవసరమైన మేరకు మాత్రమే ఇంధనం వినియోగించాలని కలెక్టర్‌ సూచించారు.

Updated Date - Mar 28 , 2026 | 11:25 PM