పత్తి కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Oct 13 , 2026 | 12:08 AM
ఖరీఫ్ సీజన్‌లో పత్తి పం ట కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అద నపు కలెక్టర్ బి. రాములుతో కలిసి పత్తి కొనుగోళ్ల ఏర్పాట్లపై అధికారులు, సీసీఐ ప్రతినిధులు, జిన్నింగ్ మిల్లుల యజమాను లతో సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్‌లో పత్తి పం ట కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అద నపు కలెక్టర్ బి. రాములుతో కలిసి పత్తి కొనుగోళ్ల ఏర్పాట్లపై అధికారులు, సీసీఐ ప్రతినిధులు, జిన్నింగ్ మిల్లుల యజమాను లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 51,400 ఎకరాల్లో పత్తి సాగు జరిగిందని, సుమారు 5,14,000 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మరో వారం రోజుల్లో పత్తి మార్కెట్‌కు రావడం ప్రారంభమై, నవంబర్, డిసెం బర్ నెలల్లో అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. రైతులు నష్టపోకుండా సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో పెద్దప ల్లి, సుల్తానాబాద్, కమాన్‌పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో గుర్తించిన జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. కనీస మద్దతు ధర, కొనుగోలు కేం ద్రాల వివరాలు, పత్తి నాణ్యతా ప్రమాణాలు, తేమ శాతంపపై రైతులకు వివరించాలని సూచించారు. పత్తిని పూర్తిగా ఆరబెట్టి, శుభ్రంగా తీసుకురావాలని, నాణ్యమైన పత్తిలో నాసిరకం పత్తిని కలపవద్దని రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. కప్పాస్ కిసాన్ యాప్ ద్వారా రైతుల నమోదు, కొనుగోలు కేంద్రాల ఎం పిక, స్లాట్ బుకింగ్ విధానంపై అవగాహన కల్పించాలని సూచిం చారు. జిన్నింగ్ మిల్లుల సామర్థ్యానికి అనుగుణంగా స్లాట్లు కేటా యించాలని, సమీపంలోని కొనుగోలు కేంద్రాలకు మ్యాపింగ్ చేయా లని ఆదేశించారు. సగటు దిగుబడి కంటే వాస్తవ దిగుబడి అధికంగా ఉన్న రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవా లని కలెక్టర్ సూచించారు. ఏఈఓల లాగిన్ ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా అర్హులైన కౌలు రైతులు, ఎన్‌డీఎస్ రైతుల నమోదు, ధ్రువీకరణకు సాఫ్ట్‌వేర్ సదుపాయం కల్పించాలన్నారు పత్తి కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, తేమ కొలిచే యంత్రాలు, ఎలకా్ట్రనిక్ తూకం యంత్రాలు తదితర మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. నిరంతరాయ విద్యుత్ సరఫరాతో పాటు అగ్ని ప్రమాదాల నివారణకు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని, పత్తి కొనుగోళ్ల అనంతరం రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, వ్యవసాయ అధికారులు, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా తూనికలు కొలతల అధికారి రఘువీర్ సింగ్, జిల్లా అగ్నిమాపక అధికారి అనిల్ కుమార్, మార్కెట్ కమిటీల కార్యదర్శులు, సీసీఐ అధికారులు పాల్గొన్నారు.