Share News

రైతులకు ఇబ్బందులను కలిగిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Nov 09 , 2026 | 11:34 PM

రైతులను ఇబ్బందులకు గురిచేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అఽధికారులను హెచ్చరించారు. సోమవారం మల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

రైతులకు ఇబ్బందులను కలిగిస్తే కఠిన చర్యలు

ధర్మారం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రైతులను ఇబ్బందులకు గురిచేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అఽధికారులను హెచ్చరించారు. సోమవారం మల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. సెంటర్లలో ధాన్యం నిల్వ ఉండకుండా త్వరగా కొనుగోలు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రైతులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన, వారిని ఇబ్బందులకు గురి చేసిన సహకార సంఘాల సీఈఓలతో పాటు అధికారులను సస్పెండ్‌ చేయడానికి వెనుకాడనని హెచ్చరించారు. ధాన్యం అమ్మిన మూడు నాలుగు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. పత్తిపాక సింగిల్‌విండో చైర్మన్‌ నోముల నర్సింహారెడ్డి, మండల అధ్యక్షుడు లావుడ్య రూప్లానాయక్‌, డీసీసీ జనరల్‌ సెక్రెటరీ గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, డీసీసీ సెక్రెటరీ కొత్త నర్సింహులు, పార్టీ సీనియర్‌ నాయకులు చింతల ప్రధీప్‌రెడ్డి, మల్లాపూర్‌ సర్పంచ్‌ మంద శ్రీనివాస్‌, డైరెక్టర్లు బద్దం రవీందర్‌ రెడ్డి, లింగారెడ్డిలు, బంగుటపు కొమురయ్య, మందల హరీష్‌, గంధం మహిపాల్‌, గంధం మల్లయ్య పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2026 | 11:34 PM