Share News

రోడ్లు, కాలువల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:19 AM

రామగుండం కార్పొరేషన్‌లో రోడ్లపై, కాలువల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్‌ మహంకాళి స్వామి హెచ్చరించారు. గురువారం కార్పొరేషన్‌ 39వ డివిజన్‌లోని కూరగాయల మార్కె ట్‌ను సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపుని చ్చారు.

రోడ్లు, కాలువల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు

కోల్‌సిటీ, మార్చి 12(ఆంధ్రజ్యోతి): రామగుండం కార్పొరేషన్‌లో రోడ్లపై, కాలువల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్‌ మహంకాళి స్వామి హెచ్చరించారు. గురువారం కార్పొరేషన్‌ 39వ డివిజన్‌లోని కూరగాయల మార్కె ట్‌ను సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపుని చ్చారు. తడిచెత్తను కంపోస్టు ఎరువుగా రీసైక్లింగ్‌ చేయడానికి కూరగాయల వ్యర్థా లను డబ్బాల్లో ఉంచి పారిశుధ్య వాహనాలకు అందించాలని కోరారు. గౌతమిన గర్‌లోని కంపోస్టు యార్డును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు, కూరగాయల, పండ్ల వ్యర్థాలను కంపోస్టుగా, బయో గ్యాస్‌గా మార్చేందుకు రీసైక్లింగ్‌ ప్రక్రియ ఆన్‌సైట్‌లో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రతి ఇంట్లో, షాపుల్లో తడి, పొడి చెత్తను వేరు చేసి అందించాలన్నారు. మార్కెట్‌ పక్కన ఉన్న నాలాను పరిశీలించారు. డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్‌ తిప్పారపు మానస, డిప్యూటీ కమిషనర్‌ నాయిని వెంకటస్వామి, ఈఈ రామన్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 12:19 AM