కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తరలించేందుకు చర్యలు
ABN , Publish Date - Jun 05 , 2026 | 11:46 PM
పెద్దపల్లి నియోజక వర్గ పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి సం బంధిత రైస్‌మిల్లులకు తర లించేందుకు చర్యలు చేప ట్టామని ప్రభుత్వ విప్, ఎమ్మె ల్యే చింతకుంట విజయరమ ణారావు తెలిపారు.
పెద్దపల్లి, జూన్ 5 (ఆంధ్ర జ్యోతి): పెద్దపల్లి నియోజక వర్గ పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి సం బంధిత రైస్‌మిల్లులకు తర లించేందుకు చర్యలు చేప ట్టామని ప్రభుత్వ విప్, ఎమ్మె ల్యే చింతకుంట విజయరమ ణారావు తెలిపారు. శుక్రవారం ఆయన పెద్దపల్లి పట్టణంలోని చీకురాయి రోడ్డులో గల రైస్‌మిల్లును సందర్శించారు. అక్కడ ధాన్యం నిల్వ చేసేందుకు గల అవకాశాలను పరిశీలిం చారు. విలేకరులతో మాట్లాడుతూ పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్ మండలాలలో లారీల జాప్యం హమాలీల కొరతతో అక్కడక్కడ కొంతమేర మిగిలి ఉందన్నారు. దానిని తరలించేందుకు లారీ అసోసియేషన్ అధ్యక్షులు బారీ, తిరుపతి, శ్రీనివాస్, సతీష్‌లతో మాట్లాడి పెద్దపల్లి, సుల్తా నాబాద్ సీఐలు ప్రవీణ్, రంజిత్ ఎస్‌ఐ లు పోలీసులు, అధికారుల సహకారంతో పూర్తి స్థాయిలో తరలించేందుకు చర్యలు చేపడుతు న్నట్లు తెలిపారు. హమాలీల కొరత లేకుండా మరి కొంతమంది హమాలీలతో మాట్లాడామని రాత్రి సమయంలో పూర్తిస్థాయిలో రెండు మూడు రోజులలో ధాన్యాన్ని లిఫ్ట్ చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆయా మండలాల్లో అక్కడక్కడ మిగిలిన ధాన్యాన్ని తరలిస్తామని తెలిపారు. మొక్కజొన్న రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు 4 కోట్ల రూపాయలు జమ అయ్యాయని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, తదితరులు ఉన్నారు.