Share News

తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు చర్యలు

ABN , Publish Date - Jun 23 , 2026 | 12:29 AM

ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్‌ వర కు ఒకే ప్రాంగణంలో ఉండేందుకు తెలంగాణ ఫ్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేస్తున్నామని, వీటిని పరిశీలించేందుకు రాష్ట్రస్థాయి అధికారుల బృందం సోమవారం వచ్చారు.

తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు చర్యలు

సుల్తానాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్‌ వర కు ఒకే ప్రాంగణంలో ఉండేందుకు తెలంగాణ ఫ్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేస్తున్నామని, వీటిని పరిశీలించేందుకు రాష్ట్రస్థాయి అధికారుల బృందం సోమవారం వచ్చారు. ఇంజనీరింగ్‌ శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ ఎండీ షఫీమియా, విద్యాశాఖ రాష్ట్ర జాయింట్‌ డైరక్టర్‌ ఉషా రాణి, జిల్లా ఇంటర్‌ మీడియట్‌ అధికారి కల్పన, జిల్లా విద్యాశాఖ అధికారి శారద, ఆంజనేయ రావు, ఈఈ అశోక్‌, ఎంఈఓలు, ప్రిన్సిపాల్స్‌ తదితరులు ప్రభుత్వ కళాశాలను సందర్శించారు. పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటుకు భవనాలను పరిశీలించారు. వారు మాట్లాడుతు తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలనే ఉద్దేశ్యంలో ప్రభుత్వం ఉందని, అందుకు సంబంధించిన పనులు వేగవంతం చేసేందుకు సుల్తానాబాద్‌, మంథని, రామగుండం ప్రాంతాల్లో ఎంపిక చేసిన స్కూల్స్‌ను సందర్శిస్తున్నా మని వారు తెలిపారు. సుల్తానాబాద్‌లో ప్రస్తుత జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ స్కూల్స్‌ ఏర్పాటు చేసేందుకు ఒక్కోక్క దానికి రూ.15 కోట్ల వరకు నిధులు మం జూరు చేస్తోంది. సుల్తానాబాద్‌లో భవనాల నిర్మాణానికి అధికారుల బృం దం అంచనాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న భవనాల కొలతలు తీసుకొన్నారు. సుల్తానాబాద్‌ స్కూల్‌లో మొత్తం 55 గదులు అవసరం ఉంటుందని, ఐదు ఎకరాల విస్తీర్ణం ఉండాలని అధికారులు తెలి పారు. ప్రసుత్తం కాలేజీ భవనంతో పైన కూడా మరో ఫ్లోర్‌ నిర్మిస్తామని, హైస్కూల్‌ భవనాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ మరో 13 కొత్తగా గదులు, భవన సముదాయలు చేపట్టనున్నట్లు తెలిపారు. అందుబాటులో ఉన్న గదులు భవనాలతో ఈ విద్యా సంవత్సరం నుంచే స్కూల్‌ను ప్రారం భించాలని ప్రిన్సిపాల్స్‌కు సూచించారు. పీ ప్రైమరీ, ప్రైమరీ, ఇంటర్‌ వరకూ మూడు విభాగాలను నిర్వహిస్తామని ముగ్గురు ప్రిన్సిపాల్స్‌ ఉంటారని చెప్పారు.

మంథని, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయనున్న పబ్లిక్‌ స్కూల్‌ నిర్మాణం కోసం విద్యాశాఖ చీఫ్‌ ఇంజనీర్‌ షాఫీమియా, జాయింట్‌ డైరెక్టర్‌ ఉషారాణిలు స్థానిక హైస్కూల్‌ ప్రాంగణాన్ని సోమవారం పరిశీలించారు. తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటు కోసం స్థానిక హైస్కూల్‌, బాలుర జూనియర్‌ కళాశాల భవనాలను, ప్రాంగణంలో స్థలాన్ని పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేసే తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ వసతుల కల్పన పై సమీక్షించారు.

Updated Date - Jun 23 , 2026 | 12:29 AM