తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - May 05 , 2026 | 11:46 PM
జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు చేప ట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళ వారం కలెక్టరేట్‌లో తాగునీటి సరఫరా, వేసవి యాక్షన్ ప్లాన్‌పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు.
పెద్దపల్లి, మే 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు చేప ట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళ వారం కలెక్టరేట్‌లో తాగునీటి సరఫరా, వేసవి యాక్షన్ ప్లాన్‌పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరాలో ఎక్కడైనా అంతరాయం కలిగితే వెం టనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు నీటి కొరతతో ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్త గృహ కనెక్షన్లను గ్రామ పంచాయతీ నిధుల ద్వారా వేగంగా మంజూరు చేయాలని తెలి పారు. పైప్‌లైన్ లీకేజీలను వెంటనే మరమ్మతు చేసి నీటి వృథా నివారిం చాలన్నారు. ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాం కుల చిన్నపాటి మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగం లోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ హౌసింగ్ పథకం పురోగతిని వేగవంతం చేయాలని, లబ్ధిదారులందరిని సంప్రదించి గృహ నిర్మాణ పనులు ప్రారంభించేలా చూడాలని తెలిపారు. బిల్లులు చెల్లించడంతో పాటు అవసరమైన నమోదు వివరాలను సమయానుసారం నమోదు చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ పూర్ణ చం దర్, ఇంట్రా ఈఈ శ్రీనివాస్, పీడీ హౌసింగ్ రాజేశ్వర్, ఎంపీడీవోలు, తదితర అధికారులు పాల్గొన్నారు.