హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:32 AM
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీ కార్మికుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై హమాలీ సంఘాల ప్రతినిధులు, లారీ ఓనర్ల యాజమాన్యంతో సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీ కార్మికుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై హమాలీ సంఘాల ప్రతినిధులు, లారీ ఓనర్ల యాజమాన్యంతో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడు తూ రైస్‌మిల్లుల్లో హమాలీల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, స్థానికంగా హమాలీలా కొరత ఉంటే ప్రత్యామ్నాయంగా బీహార్ కార్మికు లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ధాన్యం రవాణా చేసే ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకర్ ఉండాలని స్పష్టం చేశారు. తూకం యంత్రాలు, మాయిశ్చర్ మీటర్లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉండేలా అధికారులు తనిఖీ చేయాలన్నారు. ఈసారి కొనుగోలు ప్రక్రియలో ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నందున, క్షేత్రస్థాయిలో తాజా ఫొటోలు, వివ రాలను నమోదు చేయాలని, ధాన్యం నిల్వకు గోదాం స్థలాన్ని ముందు గానే గుర్తించాలన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా సహకార అధికారి శ్రీమాల, లారీ ఓనర్ల యాజమాన్యం, హమాలీ సంఘాల ప్రతినిధులు, రవాణా కాంట్రాక్టర్లు, అధికారులు, పాల్గొన్నారు.