Share News

గోదాంల నిర్మాణాలకు చర్యలు

ABN , Publish Date - May 25 , 2026 | 11:33 PM

రాష్ట్రం లో 15 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం నిల్వ చేసేం దుకు గోదాంల నిర్మాణాలకు చర్యలు చేపడుతు న్నట్లు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగే శ్వర్‌రావు తెలిపారు. రాఘవపూర్‌లోని జీఎంఆర్‌ గోదాంలను సోమవారం సందర్శించారు.

గోదాంల నిర్మాణాలకు చర్యలు

పెద్దపల్లి రూరల్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో 15 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం నిల్వ చేసేం దుకు గోదాంల నిర్మాణాలకు చర్యలు చేపడుతు న్నట్లు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగే శ్వర్‌రావు తెలిపారు. రాఘవపూర్‌లోని జీఎంఆర్‌ గోదాంలను సోమవారం సందర్శించారు. నిల్వలను పరిశీలించి నిర్వహణ తీరును తెలుసుకున్నారు. చైర్మ న్‌ నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ పెద్దపల్లి మాజీ ఎమ్మె ల్యే గీట్ల ముకుందరెడ్డి ఈ ప్రాంత రైతులకు ఉప యోగ పడేవిధంగా ముందు చూపుతో 1.80 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాంల నిర్మాణం చేపట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల నుండి 15 లక్షల వరకు మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాంల నిర్మాణ పనులు పలు ప్రాంతాల్లో పురో గతిలో ఉన్నాయని తెలిపారు. వచ్చే రెండేళ్లలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అనం తరం గోదాంల నిర్వాహకులు గిడ్డంగుల చైర్మన్‌ నాగే శ్వర్‌రావును సన్మానించారు. గిడ్డంగుల సంస్థ రీజనల్‌ మేనేజర్‌ సోమయ్య, మేనేజర్‌ పొన్నం సతీష్‌ గౌడ్‌, జీఎంఆర్‌ గోదాం నిర్వాహకులు నరసింహారెడ్డి, సత్య నారాయణరెడ్డి, పెద్దపల్లి సింగిల్‌ విండో చైర్మ న్‌ మాదిరెడ్డి నరసింహారెడ్డి పాల్గొన్నారు.

అభివృద్ధి ఓర్వలేని ప్రతిపక్షాలు

ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చేపడు తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి ఓర్వలేక రైతులను, ప్రజలను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నా యని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు అన్నారు. లాలపల్లిలోని కోమటిగుట్టకు 20 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మా ణానికి రూ.14.38 కోట్లతో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ నాగేశ్వరరావుతో కలిసి భూమిపూజ చేశారు. విప్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా గోదాముల నిర్మాణం చేపట్ట లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్క్‌ఫెడ్‌ ద్వారా మక్క లు కొనుగోలు చేసి నిలువ చేసేందుకు సరైన గోదాములు లేక ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తుకు చేశారు. గిడ్డంగుల చైర్మన్‌ తోడ్పాటుతో 20 వేల మెట్రిక్‌ టన్నుల గోదాం నిర్మిస్తున్నామన్నారు. కోఆపరే టివ్‌ సొసైటీ ఆధ్వర్యంలో నాబార్డు సహకా రంతో 14 వేల మెట్రిక్‌ టన్నుల గోదాముకు త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. పంటల దిగుబడి అధికంగా రావడం, హమాలీల కొరతతో రాత్రి 10 గం టల వరకు కూడా కొనుగోలు కేంద్రాలు పని చేస్తు న్నాయన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ రైతులను రెచ్చగొట్టే ప్రయ త్నం చేస్తున్నారని, రైతు గోస అంటున్న బీజేపీ నాయకులు నరేంద్రమోదీ వద్దకు పోయి గోస విని పించాలని విమర్శించారు. పంట మార్పిడి చేయాలని, తాను కూడా మూడెకరాల్లో పామాయిల్‌ తోట పెట్టనున్నట్లు తెలిపారు. రైతులు కూరగాయలు, ఆకు కూరలు సాగు చేయాలన్నారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్‌ రెడ్డి, నాయకులు దుగ్యాల సంతోష్‌రావు, అర్శనపల్లి వెంకటేశ్వర్‌రావు, సర్పంచ్‌లు ఏలేటి వెంకట్‌ రెడ్డి, కప్పల ప్రవీణ్‌, మద్దెల రమాదేవి, మారం కొమురయ్య, పల్లెర్ల వెంకటేష్‌, గోపు రజిత, సిద్ది తిరుపతి, పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2026 | 11:33 PM