Share News

రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:05 AM

ఎల్‌నినో పరిస్థితులను ఎదు ర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. చిన్నకల్వల ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చిన్నబొంకూర్‌, పేరుక పల్లి, రెబ్బల్‌దేవ్‌ పల్లి గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

సుల్తానాబాద్‌, అక్టోబరు30(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో పరిస్థితులను ఎదు ర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. చిన్నకల్వల ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చిన్నబొంకూర్‌, పేరుక పల్లి, రెబ్బల్‌దేవ్‌ పల్లి గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో వడ్లకు ఉన్న డిమాండ్‌ను ఆసరా చేసుకొని మధ్య దళారులు రైతులను మోసం చేసే అవకాశాలు ఉన్నాయని, అందువల్ల రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాపా రులు, దళారులు ధర తగ్గించేందుకు ప్రయత్నాలను మానుకోవాలన్నారు. కొనుగోలు సెంటర్లలో మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్‌ చెల్లిస్తార న్నారు. యాసంగిలో వరి పంట వేయవద్దని కోరారు. కేవలం తాగునీటి అవసరాలకే ఎస్సారెస్పీ నీటిని వినియోగించడం జరుగుతుందన్నారు. ఆరుతడి పంటలు వేసుకునే రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుం దన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రకాష్‌ రావు, సింగిల్‌ విండో చైర్మన్‌ గౌరవెల్లి మురళీధర్‌ రావు, మండల పార్టీ అధ్యక్షుడు చిలుక సతీష్‌, సిం గిల్‌ విండో డైరెక్టర్లు, కార్యదర్శి రమేష్‌ సర్పంచులు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2026 | 12:05 AM