ప్రశాంతంగా పది పరీక్షలు ప్రారంభం
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:41 PM
జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనట్లు జిల్లా విద్యాధికారి శారద పేర్కొన్నారు. మొదటి రోజు శనివారం జిల్లా వ్యాప్తంగా 41 పరీక్ష కేంద్రాల్లో 7,480 మంది విద్యార్థులకుగాను 7,473 మంది పరీక్షలు రాశారని, 99.9 శాతం నమోదైనట్లు తెలిపారు.
పెద్దపల్లి కల్చరల్, మార్చి14(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనట్లు జిల్లా విద్యాధికారి శారద పేర్కొన్నారు. మొదటి రోజు శనివారం జిల్లా వ్యాప్తంగా 41 పరీక్ష కేంద్రాల్లో 7,480 మంది విద్యార్థులకుగాను 7,473 మంది పరీక్షలు రాశారని, 99.9 శాతం నమోదైనట్లు తెలిపారు. మరో ఆరుగురు ప్రైవేటుగా పరీక్షలు రాసే విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఆయా పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు అనుకున్న సమయానికి కంటే ముందుగా చేరుకొన్నారన్నారు. కేంద్రాల్లో విద్యార్థులకు మౌలిక వసతులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయగా, మెడికల్ సిబ్బంది మెడిసిన్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సిద్ధం చేసుకున్నారన్నారు. తాగునీటి సమస్య లేకుండా చేశారని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులు పరీక్షలు రాశారని జిల్లా విద్యాధికారి పేర్కొన్నారు.