లోక్ అదాలత్‌లతో సత్వర న్యాయం
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:00 AM
లోక్ అదాలత్‌లతో సత్వర న్యాయం సాధ్యమని గోదావరిఖని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ టీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ నెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ సన్నాహక సదస్సును గోదావరిఖని సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో మంగళవారం న్యాయస్థానం ఆవరణలో సమీక్ష నిర్వహించారు.
కోల్‌సిటీ, మార్చి 17(ఆంధ్రజ్యోతి): లోక్ అదాలత్‌లతో సత్వర న్యాయం సాధ్యమని గోదావరిఖని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ టీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ నెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ సన్నాహక సదస్సును గోదావరిఖని సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో మంగళవారం న్యాయస్థానం ఆవరణలో సమీక్ష నిర్వహించారు. కక్షిదారులు క్షణికావేశంలో కేసులపాలై కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలాన్ని, డబ్బును వృధా చేసుకోకుండా ఇరువర్గాలు రాజీకుదుర్చుకోవాలన్నారు. లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదుర్చుకుంటే ఎలాంటి అప్పీలకు చోటు ఉండదన్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల వారీగా రాజీ కాదగిన కేసుల గురించి ఆరా తీశారు. గోదావరిఖని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వెంకట సచిన్‌రెడ్డి, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి వెంకటేష్ దురువ, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాద్‌రావు, ప్రవీణ కుమార్, ఎస్‌ఐలు వెంకటస్వామి, సంధ్యారాణి, ప్రసాద్, శ్రీనివాస్‌తో పాటు కోర్టు డ్యూటీ ఆఫసీర్లు పాల్గొన్నారు.