Share News

నర్సింగ్‌ కళాశాల పనులను వేగవంతం చేయండి

ABN , Publish Date - Apr 19 , 2026 | 12:07 AM

గోదావరిఖని ఎల్‌బీనగర్‌లో రూ.27కోట్లతో నిర్మిస్తున్న నర్సింగ్‌ కళాశాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అధికారులకు సూచించారు. నిర్మాణంలో ఉన్న కళాశాల భవన నిర్మాణ పనులను శనివారం మేయర్‌ మహంకాళి స్వామితో కలిసి పరిశీలించారు.

నర్సింగ్‌ కళాశాల పనులను వేగవంతం చేయండి

కళ్యాణ్‌నగర్‌, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని ఎల్‌బీనగర్‌లో రూ.27కోట్లతో నిర్మిస్తున్న నర్సింగ్‌ కళాశాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అధికారులకు సూచించారు. నిర్మాణంలో ఉన్న కళాశాల భవన నిర్మాణ పనులను శనివారం మేయర్‌ మహంకాళి స్వామితో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యత, వేగం పెంచాలని, అవసరమైన అన్ని రకాల సదుపాయలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా కళాశాల భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని సూచించారు. నియోజకవర్గంలో విద్య, మౌలిక వసతలు, అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నట్టు, నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి చేసే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. అనంతరం ఎల్‌బీనగర్‌ నుంచి పరుశరాంనగర్‌ వరకు నిర్మించనున్న రోడ్డు పనులను ప్రారంభించారు. ఆర్‌జీ-1 జీఎం లలిత్‌ కుమార్‌, డీజీఎం(సివిల్‌) వర ప్రసాద్‌, కార్పొరేటర్‌ దూళికట్ట సతీష్‌, నాయకులు దాసరి విజయ్‌, సింగరేణి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 12:07 AM