Share News

భూముల రీ సర్వేను వేగవంతం చేయండి

ABN , Publish Date - Oct 09 , 2026 | 11:56 PM

భూముల రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, వేగవం తంగా పూర్తి చేయాలని ఆర్డీవో గంగయ్య రెవె న్యూ సిబ్బందిని,అధికారులను ఆదేశించారు. కొమిరలో శుక్రవారం నిర్వహిస్తున్న భూముల రీ సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే జరుగుతున్న తీరు, ఇప్ప టివరకు పూర్తయిన వివరాలను తెలుసుకు న్నారు.

భూముల రీ సర్వేను వేగవంతం చేయండి

ఓదెల, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): భూముల రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, వేగవం తంగా పూర్తి చేయాలని ఆర్డీవో గంగయ్య రెవె న్యూ సిబ్బందిని,అధికారులను ఆదేశించారు. కొమిరలో శుక్రవారం నిర్వహిస్తున్న భూముల రీ సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే జరుగుతున్న తీరు, ఇప్ప టివరకు పూర్తయిన వివరాలను తెలుసుకు న్నారు. కొమిర గ్రామ పరిధిలో మొత్తం 1885 ఎకరాల భూమికి రీ సర్వే చేపట్టగా, ఇప్పటి వరకు 380 ఎకరాల్లో ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు వివరించారు. మిగిలిన భూముల సర్వేను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. సర్వే వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రక్రియలో పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. డిప్యూటీ తహసీల్దార్‌ షఫీ, జీపీఓ సరిత, సర్వేయర్లు,పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2026 | 11:56 PM