పారిశ్రామిక సంస్థల భద్రతపై ప్రత్యేక నిఘా ఉంచాలి
ABN , Publish Date - Nov 10 , 2026 | 11:33 PM
ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ వంటి పారిశ్రామిక ప్రాంతాల భద్రతపై ప్రత్యేక నిఘా ఉంచాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీ ల్లో భాగంగా మంగళవారం ఎన్‌టీపీసీ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు.
జ్యోతినగర్, నవంబరు 10 (ఆంధ్ర జ్యోతి): ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ వంటి పారిశ్రామిక ప్రాంతాల భద్రతపై ప్రత్యేక నిఘా ఉంచాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీ ల్లో భాగంగా మంగళవారం ఎన్‌టీపీసీ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్ కేంద్రం, సిబ్బంది బ్యారక్‌ను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు 4ఎస్ విధానాన్ని సమ ర్థవంతంగా అమలు చేయాలని సూచిం చారు. సీసీటీఎన్‌ఎస్ ద్వారా ఆన్‌లైన్‌లో కేసుల వివరాల నమోదు, రికార్డుల అప్ లోడ్ ప్రక్రియను పరిశీలించారు. సిబ్బం దితో మాట్లాడి వారి వ్యక్తిగత, విధి నిర్వ హణకు సంబంధించిన సమస్యలను తెలుసుకున్నారు. ఎన్‌టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధి అత్యంత సున్నితమైన, ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ఉద్యోగులు, ప్రజలతో పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. భద్రత విషయంలో అప్ర మత్తంగా ఉండాలని, కీలక అంశాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు. ప్రధాన రహ దారులపై ప్రమాదాల నివారణకు అవ సరమైన సైన్‌బోర్డులు, రోడ్డు ఇంజనీరింగ్ మార్పులను గుర్తించి అధికారుల ద్వారా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజ లకు వేగవంతమైన, మెరుగైన పోలీస్ సేవలు అందిస్తూ, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. గోదావరిఖని ఏసీపీ రమేష్, ఎన్‌టీపీసీ ఎస్‌ఐ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.