Share News

సోలార్‌ విద్యుత్‌పై ప్రచారం కల్పించాలి

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:18 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సం యుక్తంగా నిర్వహిస్తున్న సేవా సేతు అభియాన్‌ సదస్సులను విద్యుత్‌ విని యోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జెండా చౌరస్తా సమీపంలోని విద్యుత్‌ కార్యాలయం లో నిర్వహించిన పీఎం సూర్యఘర్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు.

సోలార్‌ విద్యుత్‌పై ప్రచారం కల్పించాలి

పెద్దపల్లి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సం యుక్తంగా నిర్వహిస్తున్న సేవా సేతు అభియాన్‌ సదస్సులను విద్యుత్‌ విని యోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జెండా చౌరస్తా సమీపంలోని విద్యుత్‌ కార్యాలయం లో నిర్వహించిన పీఎం సూర్యఘర్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మూడు రోజులపాటు నిర్వహించే సేవా సేతు అభియాన్‌ క్యాంప్‌లో ప్రతీ విద్యుత్‌ వినియోగదారుడు ఇంటిపై సోలార్‌ పలకలు ఏర్పాటు చేసుకునేందుకు స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. సోలార్‌ విద్యుత్‌ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎన్‌పీడీసీ ఎల్‌, టీజీ రెడ్కో అధికారులు, బ్యాంకర్లు, సోలార్‌ వెండర్లు ఒకే వేదికపై అందుబాటులో ఉండటం వల్ల ప్రజలకు అవసరమైన సమాచారం, సేవ లు లభిస్తున్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే లా చర్యలు చేపట్టాలన్నారు. ఎస్‌ఈ గంగాధర్‌, డీఈ బాలయ్య, ఏడీఈ మల్లేశం, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ప్రవీణ్‌, సోలార్‌ వెండర్లు, పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2026 | 12:18 AM