సోలార్ విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం
ABN , Publish Date - Nov 04 , 2026 | 11:44 PM
సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ఒక మెగావాట్ సామర్థ్యం గల సోలార్ ప్లాంట్‌ను విద్యుత్ గ్రిడ్‌కు విజయవం తంగా అనుసంధానం చేసినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం పెద్దపల్లి మం డలం రాఘవపూర్ గ్రామంలోని ట్రాన్స్‌కో కార్యా లయం, విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఒక మెగావాట్ సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ సింక్రనైజేషన్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలిం చారు.
పెద్దపల్లి రూరల్, నవంబరు 4 (ఆంధ్ర జ్యోతి): సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ఒక మెగావాట్ సామర్థ్యం గల సోలార్ ప్లాంట్‌ను విద్యుత్ గ్రిడ్‌కు విజయవం తంగా అనుసంధానం చేసినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం పెద్దపల్లి మం డలం రాఘవపూర్ గ్రామంలోని ట్రాన్స్‌కో కార్యా లయం, విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఒక మెగావాట్ సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ సింక్రనైజేషన్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలిం చారు. కలెక్టర్ మాట్లాడుతూ సహకార సం ఘాల ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో ఒక్కొక్కటి ఒక మెగావాట్ సామర్థ్యంతో మొత్తం నాలుగు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోనే సహకార సంఘాల ద్వారా నాలుగు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన జిల్లాగా పెద్దపల్లి నిలవడం గర్వకారణమని తెలిపారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు విజయవంతం కావడంలో అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, సిబ్బంది చేసిన సమష్టి కృషి అభినందనీయమని పేర్కొన్నారు. సోలార్ ప్లాంట్లను అధికారికంగా ప్రభుత్వ విప్ ద్వారా రాఘవాపూర్‌లో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా సహకార అధికారి శ్రీమాల, ట్రాన్స్‌కో ఎస్.ఈ. గంగాధర్, రెడ్ కో డీఎం మనోహర్, టీజీఎన్‌పీడీసీఎల్ అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు పెంపొందించాలి
జూలపల్లి, (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల అభ్య సన సామర్థ్యాల పెంపునకు ప్రభుత్వం రూపొం దించిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను ఉపాధ్యాయులు అమలుచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యా యుల ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థు లకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపా ధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థుల భాషా నైపుణ్యాలు, గణితంలో సాధ నపై దృష్టి సారించాలని సూచించారు. తెలు గు, ఆంగ్లం, గణితంలో నిర్వహిస్తున్న రెమిడి యేషన్ తరగతుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. మండల ఇన్‌చార్జి విద్యాధి కారి పిట్టల లచ్చయ్య, ఆర్పీలు తునికి అశోక్, నాంపెల్లి అంజయ్య, మొలుగూరి సంపత్‌కు మార్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు సతీష్, తిరుమల పాల్గొన్నారు.