ఆరు గ్యారంటీల అమలు చేయాలి
ABN , Publish Date - Mar 16 , 2026 | 11:58 PM
ఆరు గ్యారంటీలు అమలులో కాం గ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, వాటిని వెంటనే అమలు పరిచేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు బీజేపి నాయుకులు వినతిపత్రం అందజే శారు.
ధర్మారం, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ఆరు గ్యారంటీలు అమలులో కాం గ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, వాటిని వెంటనే అమలు పరిచేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు బీజేపి నాయుకులు వినతిపత్రం అందజే శారు. సోమవారం పార్టీ మండల అధ్యక్షుడు తీగుళ్ల సతీష్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి దేవి రాజలింగయ్య, మెడవేని శ్రీనివాస్‌తో కలిసి వినతిపత్రం అందజేశారు. రైతుబంధు, బోనస్, పెన్షన్ల పెంపులో కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు. వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. నాయకులు గోనె సాయి, దేవి కొమురేష్, మామిడి చందు, సాయిరాం, పాల్గొన్నారు.
కమాన్‌పూర్, (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలులో విఫలమైందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మచ్చగిరి రాములు అన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు కొయ్యడ సతీష్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐ స్రవంతి, జూనియర్ అసిస్టెంట్ సముద్రాల కిరణ్ కుమార్‌లకు వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల పేరుతో ప్రజలను మోసం చేసి, అధికారంలోకి వచ్చి, వారు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్ల పెంపు, జాడ లేదన్నారు. మండల అధ్యక్షుడు కొయ్యడ సతీష్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు మచ్చగిరి రాము, సీనియర్ నాయకులు మట్ట శంకర్, జంగాపల్లి అజయ్, బర్ల సదానందం, మట్ట మల్లేష్ పాల్గొన్నారు.
ఓదెల, (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో సీఎం ఇచ్చిన హామీల మేరకు వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు పెన్షన్లు పెంచాలని గోపరపల్లి సర్పంచ్ మద్దెవేని రవి ఆధ్వర్యంలో ఎంపీడీవో అనిల్‌రెడ్డికి మహిళలు వినతిపత్రాన్ని అందజేశారు. సర్పంచ్ రవి మాట్లాడుతూ ప్రభు త్వం ఏర్పడగానే వృద్ధులకు రెండు వేలు, వితంతువులకు మూడు వేలు, దివ్యాంగులకు రెండు వేల పెన్షన్లు పెంచుతామని హామీలు ఇచ్చారని తెలిపారు. వెంటనే పెన్షన్లు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.
జూలపల్లి, (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు కొప్పుల మహేష్ ప్రభు త్వాన్ని డిమాండ్ చేసారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని తహసీల్దార్ కార్యాలయంలో గిర్దవరి మల్లికార్జున్‌రావుకు డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని అంద జేసారు. మోహన్‌రెడ్డి, బడుగు శ్రీనివాస్, చొప్పరి నర్సన్న, వైద్య లక్ష్మన్, ఆవుల రాజు, సూర్యనారాయణ, రవిందర్‌గౌడ్, రఫిక్ పాల్గొన్నారు.