పోలీస్‌స్టేషన్ భవనాలకు స్థలాల పరిశీలన
ABN , Publish Date - Jun 15 , 2026 | 12:00 AM
పెద్దపల్లి నియోజకవర్గంలో మంజూరైన ఎలిగేడు, పెద్దపల్లి మహిళా, రూరల్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు సొంత భవనాల నిర్మాణానికి స్థలాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాలతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆదివారం పరిశీలించారు.
పెద్దపల్లి టౌన్/రూరల్/ఎలిగేడు, జూన్ 14(ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి నియోజకవర్గంలో మంజూరైన ఎలిగేడు, పెద్దపల్లి మహిళా, రూరల్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు సొంత భవనాల నిర్మాణానికి స్థలాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాలతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆదివారం పరిశీలించారు. విప్ మాట్లాడుతూ. ప్రజలకు మరింత మెరుగైన భద్రతా సేవలు అం దించేందుకు నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు అవసరమని తెలిపారు. నియోజకవర్గంలో ఏకకాలంలో నాలుగు పోలీస్‌స్టేషన్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంజూరు చేశారన్నారు. పోలీస్‌స్టేషన్ల భవన నిర్మాణానికి సంబంధించి అనువైన స్థలాల ఎంపికపై సమగ్ర నివేదికను సోమవారం సాయంత్రం లోగా సమర్పిచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు ద్వారా ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరు వవుతాయని, శాంతిభద్రతల పరిరక్షణలో ఇది కీలకంగా ఉపయోగపడు తుందని పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్‌రెడ్డి, చిలుక ప్రవీణ్, రాష్ట్ర కాంగ్రెస్ యువజన కార్యదర్శి దుగ్యాల సంతోష్ రావు, సర్పంచ్‌లు కప్పల ప్రవీణ్, ఏలేటి వెంకట్ రెడ్డి, మారం కొమురయ్య, సీఐ రంజిత్ రావు, ఎస్‌ఐలు మధుకర్, చంద్రకుమార్, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.