ఎస్‌ఐఆర్‌ను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Jun 18 , 2026 | 12:01 AM
జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కొప్పుల వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అమర్ చంద్ కల్యాణ మండపంలో బూత్ స్థాయి అధికారులకు, సూపర్‌వైజర్‌లకు ఎస్‌ఐఆర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
పెద్దపల్లి రూరల్, జూన్ 17 (ఆంఽధ్రజ్యోతి): జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కొప్పుల వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అమర్ చంద్ కల్యాణ మండపంలో బూత్ స్థాయి అధికారులకు, సూపర్‌వైజర్‌లకు ఎస్‌ఐఆర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను సజావుగా సాగించాలని, వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ రాజయ్య, డిప్యూటీ తహసీల్దార్ విజేందర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
జేఎన్టీయూలో బీఎల్‌వోలతో సమావేశం
రామగిరి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం బీఎల్‌వో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి హాజరయ్యారు. దేశంలో జరిగుతున్న సర్ కార్యక్రమంపై బీఎల్‌వోలకు శిక్షణ ఇచ్చారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బీఎల్‌వోలకు వివరిస్తూ అవగాహన కల్పించారు. ఆర్డీవో సురేష్, తహసీల్దార్‌లు సుమన్, వాసంతిలు, ఈఆర్‌వో, ఏఈఆర్‌వో, సిబ్బంది పాల్గొన్నారు.