Share News

ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి

ABN , Publish Date - Oct 09 , 2026 | 11:52 PM

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సీపీఐ జిల్లా నాయకులు సంఘీభావం ప్రకటించారు.

ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి

పెద్దపల్లి టౌన్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సీపీఐ జిల్లా నాయకులు సంఘీభావం ప్రకటించారు. ముస్లిం ఐక్యవేదిక నాయకులు, సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓటర్లను తొలగించడం ప్రజాస్వామ్యంలో పౌరులకు ఉన్న హక్కును హరించడమేనని విమర్శించారు. ఓటర్లు నాయకులను ఎన్నుకునే విధానానికి బదులుగా నాయకులే ఓటర్లను ఎంపిక చేసుకునే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్ల నియామకంలో గతంలో ఉన్న విధానాన్ని పునరుద్ధరించి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భాగస్వామ్యంతో నిష్పక్షపాత ఎంపిక కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయడంతోపాటు జ్ఞానేష్‌ కుమార్‌ను బర్తరఫ్‌ చేయాలని కోరారు. జామా మసీదు మౌలానా మహమ్మద్‌ అజీముద్దీన్‌ అహ్మద్‌, నాయకులు సయ్యద్‌ మస్రత్‌, అబ్దుల్‌ హై జావిద్‌, ఎంఏ మొహీద్‌, కౌన్సిలర్లు మీర్జా షంషేర్‌ బేగ్‌, అస్లాం పర్వేజ్‌, సల్మాన్‌, అష్రాఫ్‌, యూనిస్‌ ఖాన్‌, నదీమ్‌, రఫీ ఉల్లా ఖాన్‌, మెహరాజ్‌, ఇమ్రాన్‌, బొడ్డుపల్లి శ్రీను, భూతగడ్డ సంపత్‌, సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు బాలసాని లెనిన్‌, పట్టణ కార్యదర్శి కల్లేపల్లి నవీన్‌, కుక్క శ్రావణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2026 | 11:52 PM