Share News

6,31,018 ఓట్లతో సర్‌ డ్రాఫ్టు

ABN , Publish Date - Aug 18 , 2026 | 12:09 AM

జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6,31,018 మంది ఓటర్లతో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ముసాయిదా ఓటర్ల జాబితాను సంబంధిత అధికారులు సోమవారం విడుదల చేశారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ రామగుండం సహ పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీల్లో, 263 గ్రామ పంచాయతీల్లో ముసాయిదా జాబితాలను నోటీసు బోర్డులపై ఏర్పాటు చేశారు.

6,31,018 ఓట్లతో సర్‌ డ్రాఫ్టు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6,31,018 మంది ఓటర్లతో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ముసాయిదా ఓటర్ల జాబితాను సంబంధిత అధికారులు సోమవారం విడుదల చేశారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ రామగుండం సహ పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీల్లో, 263 గ్రామ పంచాయతీల్లో ముసాయిదా జాబితాలను నోటీసు బోర్డులపై ఏర్పాటు చేశారు. జాబితాల్లో తమ పేర్లు లేని ఓటర్లు ఆధారాలతో సహ అభ్యంతరాలను సంబంధిత అధికారులకు అందజేస్తే ఓటర్ల తుది జాబితాలో తిరిగి ఓటు హక్కు కల్పించనున్నారు. రామగుండం, మంథని, పెద్దపల్లి మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, మొత్తం 7,12,157 మంది ఓటర్లు ఉన్నారు. వీరిందరికీ బీఎల్‌వోలు సర్‌ ఫారాలు అందజేయగా, వాటిని నింపి బీఎల్‌వోలకు అందజేయగా, 6,31,018 మంది ఓటర్లు సరైన వాళ్లని గుర్తించిన అధికారులు డిజిటలైజేషన్‌ చేశారు. 81,139 మందిలో కొందరు అనాలమిస్‌ జాబితాలో ఉండగా, కొందరు మరణించిన వాళ్లు, కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి వాళ్లు, రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండి ఒక చోట మాత్రమే సర్‌ ఫారాలు అందించిన వాళ్లు ఉన్నట్లు సమాచారం. మరణించిన వాళ్లు, బోగస్‌ ఓట్లు, డబుల్‌ ఓట్లను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం 2002 ఓటర్ల జాబితాను అనుసరించి స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) జూన్‌ 26 నుంచి నలభై ఆరు రోజుల పాటు చేపట్టిన రివిజన్‌ ఈ నెల 10వ తేదీ వరకు ముగిసింది. గ్రామాలు, పట్టణాల్లో బూత్‌ లెవెల్‌ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటరు ఫారాలను అందజేశారు. తిరిగి బీఎల్‌వోలకు ఓటర్లు అందించిన ఫారాలను పరిశీలించి డిజిటలైజేషన్‌ చేశారు. సోమవారం 6,31,018 ఓటర్ల ముసాయిదా డ్రాఫ్టును విడుదల చేశారు. వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబరు 16వ తేదీ లోపు సమర్పించాలి. వాటిని అక్టోబరు 10వ తేదీ నాటికి పరిష్కరించి 19వ తేదీన తుది ఓటర్ల జాబితాలను విడుదల చేయనున్నారు. జాబితాలో చేరని 81,139 మంది ఓటర్ల గురించి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఆరా తీయడం ఆరంభించారు. ఆయా కార్యాలయాల వద్దకు నేరుగా వెళ్లి ఓటర్ల జాబితాలను చూడని వాళ్లు ఆన్‌లైన్‌లో సీఈఓ.తెలంగాణ వెబ్‌ సైట్‌లో చూసుకునే వీలు కల్పించారు.

ఫ సర్‌ ముసాయిదా జాబితా ప్రకారం నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్య

--------------------------------------------

నియోజకవర్గం బూత్‌లు మొత్తం సర్‌ తగ్గనున్న

ఓటర్లు ముసాయిదా ఓట్లు

-------------------------------------------------------

రామగుండం 264 2,13,990 1,83,233 30,757

మంథని 295 2,38,765 2,14,924 23,841

పెద్దపల్లి 293 2,59,402 2,32,861 26,541

------------------------------------------------------

మొత్తం 852 7,12,157 6,31,018 81,139

-------------------------------------------------------

Updated Date - Aug 18 , 2026 | 12:09 AM