సింగరేణి కార్మికుల ఆశీర్వాదం కోసం వచ్చా
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:25 AM
సింగరేణి కార్మికుల ఆశీ స్సుల కోసం వచ్చానని, సామాజిక తెలంగాణ లక్ష్యంతో ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేనకు సింగరేణి కార్మికుల మద్దతుగా నిలుస్తారని ఆశిస్తు న్నట్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు.
యైుటింక్లయిన్‌కాలనీ, జూన్ 18(ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికుల ఆశీ స్సుల కోసం వచ్చానని, సామాజిక తెలంగాణ లక్ష్యంతో ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేనకు సింగరేణి కార్మికుల మద్దతుగా నిలుస్తారని ఆశిస్తు న్నట్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. బాయిబాటలో భాగంగా గురువారం ఓసీపీ-3లో కార్మికులతో మాట్లాడారు. సింగరేణిలో బ్రిటీష్ తరహా నియంతృత్వపాలన నడుస్తున్నదని, కార్మికులకువసతులు కల్పించకుండా పని ఒత్తిడికి గురి చేస్తున్నట్టు కవిత పేర్కొన్నారు. రక్షణ చర్యల్లో లోపాలు ఉన్నాయని, కార్మికులను క్రమశిక్షణా చర్యల పేరిట భయ భ్రాంతులకు గురిచేయడం మానుకోవాలని యాజమాన్యానికి కవిత సూచిం చారు. కోల్‌బెల్ట్ మద్దతు ఇచ్చిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, గుర్తింపు సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీలు కార్మికుల సమస్యలను విస్మరించినట్టు పేర్కొన్నారు. బీఆర్ ఎస్ పాలనలో కార్మికపక్షాన తాను నిలిస్తే కొందరు నాయకులు కాంట్రాక్టర్ల పక్షాన నిలిచినట్టు ఆమె తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో కార్మికులకు అన్యాయం జరిగిన మాట వాస్తవమని, జరిగిన తప్పిదాలకు కార్మిక వర్గాన్ని క్షమాపణ కోరుతున్నానని కవిత అన్నారు. కార్మికులు ఆర్థికంగా నష్టపోయా రని, ఆత్మపరిశీలన చేసుకుని ఇటువంటి తప్పులు జరగకుండా సరి చేసుకుం టామని కవిత అన్నారు. సింగరేణిలో టీఆర్‌ఎస్ హెచ్‌ఎంఎస్‌తో కలిసి పని చేస్తుందని, హెచ్‌ఎంస్ గెలిపిస్తే మార్పు అంటే ఏంటో చూపిస్తామన్నారు. సింగరేణి విస్తరించి ఉన్న జిల్లా హెడ్‌క్వార్టర్‌లో కార్మికులకు సొత ఇంటి పథకం కింద ఇళ్ళ స్థలాలు ఇప్పించడం, ప్రతీ నెల రెండు మెడికల్ బోర్డులు నిర్వహించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న 2000 డిపెండెంట్లకు ఉద్యోగిస్తామని తెలిపారు. అనంతరం క్యాంటీన్‌లో కార్మికు లతో కలిసి టిఫిన్ చేశారు. ప్రాజెక్టులోని ఎస్‌అండ్‌డీ, బేస్‌వర్క్‌షాప్ సెక్షన్‌ల కార్మికులను కలసి మాట్లాడారు. కవిత వెంట నాయకులు రియాజ్ అహ్మద్, దావు రమేష్, కట్కూరి రత్నాకర్‌రెడ్డి, ఆరె మల్లేష్, సమ్మయ్య, అయాజ్ అహ్మద్, నజీర్‌ఖాన్, శినిగరపు పోచం ఉన్నారు.