Share News

సింగరేణి అధికారుల పోరుబాట

ABN , Publish Date - Jul 07 , 2026 | 12:16 AM

సింగరేణి అధికారులు పోరుబాట పట్టారు. సమస్యలు పరిష్కరిం చాలని ఆరు నెలలుగా వివిధ రూపాల్లో నిరసనలు, ఆం దోళనలు నిర్వహిస్తున్నారు. సింగరేణి అధికారుల సం ఘం(సీఎంఓఏ) ఎనిమిది ప్రధాన డిమాండ్లతో నెల రోజులుగా ప్రత్యక్ష పోరాటాలకు దిగింది.

సింగరేణి అధికారుల పోరుబాట

గోదావరిఖని, జూలై 6 (ఆంధ్రజ్యోతి): సింగరేణి అధికారులు పోరుబాట పట్టారు. సమస్యలు పరిష్కరిం చాలని ఆరు నెలలుగా వివిధ రూపాల్లో నిరసనలు, ఆం దోళనలు నిర్వహిస్తున్నారు. సింగరేణి అధికారుల సం ఘం(సీఎంఓఏ) ఎనిమిది ప్రధాన డిమాండ్లతో నెల రోజులుగా ప్రత్యక్ష పోరాటాలకు దిగింది. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫర్ఫార్మెన్స్‌ రిలేటెడ్‌ పే (పీఆర్‌పీ)ని అమలు చేయాలని, ప్రమోషన్‌ పాలసీని రూపొందించా లని, పదోన్నతులు, బదిలీలు పారదర్శంగా నిర్వహించా లనే డిమాండ్లతోపాటు సింగరేణిని కాపాడుకునేందుకు సంస్థలో రాజకీయ జోక్యం ఉండరాదని, సింగరేణికి ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన రూ.50వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని అధికారుల సంఘం డిమాండ్‌ చేస్తున్నది. అధికారుల క్వార్టర్లకు ఉచిత విద్యుత్‌, ఐఐటీలకు ఎంపికైన అధికారుల పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింప చేయాలని డిమాండ్‌ చేస్తూ సింగరేణి వ్యాప్తంగా 2,350మంది అధికారులు ఆందోళ నకు దిగారు. మొదట నిరసన ప్రదర్శనలు నిర్వహించిన అధికారులు జూన్‌ 30 నుంచి ఈనెల 13 వరకు సింగ రేణి వ్యాప్తంగా జీఎం కార్యాలయాల ఎదుట నిరాహార దీక్షలకు పూనుకున్నారు. తొమ్మిది రోజులుగా సింగరేణి అధికారులు దీక్షలు కొనసాగిస్తున్నారు. కార్మిక సం ఘాలు, రాజకీయ పక్షాలు దీక్షలకు సంఘీభావం తెలు పుతున్నాయి. సింగరేణి యాజమాన్యం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. సింగరేణి బోర్డులో తేల్చాల్సిన విషయాలను సెక్రటేరియేట్‌ మెట్లు ఎక్కేదాక తీసుకెళ్లారని అధికారులు విమర్శిస్తున్నారు. యాజమా న్యం మాత్రం అధికారుల డిమాండ్లకు సంబంధించిన నివేదిక ముఖ్యమంత్రి పరిధిలో ఉందని చేతులు దులుపుకుంటోంది.

కోల్‌ ఇండియాలో 2007 నుంచి పీఆర్‌పీ అమలు లోకి వచ్చింది. సింగరేణిలో 2009 నుంచి పీఆర్‌పీ అమలు మొదలైంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2009 నుంచి 2014వరకు అధికారులకు పీఆర్‌పీ అమలు చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరు వాత 2021-22 పీఆర్‌పీ చెల్లిస్తూ వచ్చింది. 2009 నుంచి 2014 వరకు రావాల్సిన పీఆర్‌పీ బకాయిలను అధికార సంఘం న్యాయ పోరాటం చేసి ఆ ఏరియర్స్‌ను పొం దింది. అయితే 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరా లకు సంబంధించిన పీఆర్‌పీ బకాయిలు సుమారు రూ.250కోట్లు అధికారులకు రావాల్సి ఉంది. సింగరేణి లాభనష్టాలు, లావాదేవీలు, చెల్లిం పుల్లో పీఆర్‌పీ కింద అధికారులకు చెల్లించాల్సిన రూ.250కోట్ల కేటాయింపు లు జరిగినట్టు అధికారుల సంఘం చెబుతోంది. కేటా యించిన డబ్బులను చెల్లించాలని డిమాండ్‌ చేస్తోంది. కోల్‌ ఇండియాలో 2024-25 వరకు పీఆర్‌పీ చెల్లింపులు జరిగాయని సీఎంఓఏ వాదిస్తున్నది. కోల్‌ ఇండియాలో పే రివిజన్‌ జరిగి అక్కడి అధికారులకు నికర జీతం పెరిగిందని, సింగరేణిలో పే రివిజన్‌కు సంబంధించిన బేసిక్‌ను పెంచలేదని అధికారులు ఆరోపిస్తున్నారు. తమ డిమాండ్లన్నీ సింగరేణి అంతర్గత వ్యవహారాలేనని సింగరేణి బోర్డు మాత్రమే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, కానీ యాజమాన్యం ప్రభుత్వంపై నెడుతూ కాలయాపన చేస్తుందని ఆరోపిస్తున్నారు. కోల్‌ ఇండి యాలో బేసిక్‌పై 1శాతం కోత విధించి అధికారుల క్వార్టర్లకు ఉచితంగా విద్యుత్‌ అందిస్తారని, సింగరేణిలో కోత విధిస్తూనే బిల్లులు వసూలు చేస్తున్నారని అధికా రులు అంటున్నారు. డిమాండ్లు సాధించుకునేందుకు అధికారుల సంఘం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు సిద్ధమవుతున్నది. హైదరాబాద్‌ ఇందిరా పార్క్‌లో ధర్నా చేసేందుకు సీఎంఓఏ అధికారులు పోలీసు అనుమతులకు దరఖాస్తు చేసుకున్నారు. అధికా రులకు, సింగరేణి యాజమాన్యానికి మధ్య ఉన్న సయో ధ్య భగ్నమైతే యాజమాన్యానికి కార్యనిర్వహణలో సం క్లిష్టతలు ఏర్పడే అవకాశం ఉంది.

Updated Date - Jul 07 , 2026 | 12:16 AM