‘ఇందిరమ్మ’ నిర్మాణాలకు సింగరేణి భూములివ్వాలి
ABN , Publish Date - Aug 20 , 2026 | 11:49 PM
రామగుండం నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సింగరేణి సంస్థ ఖాళీగా ఉన్న భూములను కేటాయించాలని, నిరు పేదలు ఇందిరమ్మ పథకంలో చేసు కుంటున్న నిర్మాణాలను అడ్డుకోవద్దని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాల యంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో సింగరేణి, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
కోల్‌సిటీ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రామగుండం నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సింగరేణి సంస్థ ఖాళీగా ఉన్న భూములను కేటాయించాలని, నిరు పేదలు ఇందిరమ్మ పథకంలో చేసు కుంటున్న నిర్మాణాలను అడ్డుకోవద్దని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాల యంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో సింగరేణి, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో సుమా రు 12వేల పట్టాలు ఇచ్చారని, సింగరేణి సంస్థ ఆ పట్టాలు ఇచ్చిన స్థలాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులు చేయడం సరికాద న్నారు. సింగరేణి స్థలాలను క్రమబద్దీక రించిన చోట ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను అడ్డుకోవద్దన్నారు. అలాగే ఇతర నిర్మాణాల స్థలాలు క్రమబద్దీకరించేందుకు ప్రతిపాద నలు పంపాలని కోరారు. అలాగే సింగరేణి సంస్థ వద్ద నిరుపయోగంగా ఉన్న భూము లను ఇందిరమ్మ కాలనీల నిర్మాణాలకు అప్పగించాలన్నారు. హిందూ శ్మశానవాటిక నిర్మాణం ప్రారంభించాల్సి ఉన్నందు వల్ల ఆ స్థలాలను అప్పగించాలన్నారు. అభివృద్ధి పనులకు సింగరేణి అడ్డుపడవద్దని, బోర్డులు పాతవద్దన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మా ణాల జాప్యంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న సింగరేణి భవనాలను ప్రభుత్వశాఖలకు కేటాయించేలా చూడాల న్నారు. అవసరమైన ప్రతిపాదనలు సింగ రేణి పంపి ఆమోదమయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. శ్మశానవాటిక పనులు ప్రారంభానికి ఎలాం టి ఇబ్బందులు ఉండవన్నారు. అదనపు కలె క్టర్ అరుణశ్రీ, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాత పెల్లి ఎల్లయ్య, ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్, ఆర్‌జీ-1, 2 ఏరియాలకు చెందిన సివిల్, ఎస్టేట్ అధికారులు పాల్గొన్నారు.