Share News

కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్న సింగరేణి

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:25 AM

కార్మికుల జీవితాలతో సింగరేణి యాజమాన్యం ఆడుకుంటుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఆరోపించారు. సోమవారం గోదావరిఖని చౌరస్తాలోని టీబీజీకేఎస్‌ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారులకు షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని, క్యాంపు కార్యాలయంలో సింగరేణి అధికా రులతో సమావేశాన్ని నిర్వహించడం ఆక్షేపనీయమ న్నారు.

కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్న సింగరేణి

గోదావరిఖని, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): కార్మికుల జీవితాలతో సింగరేణి యాజమాన్యం ఆడుకుంటుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఆరోపించారు. సోమవారం గోదావరిఖని చౌరస్తాలోని టీబీజీకేఎస్‌ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారులకు షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని, క్యాంపు కార్యాలయంలో సింగరేణి అధికా రులతో సమావేశాన్ని నిర్వహించడం ఆక్షేపనీయమ న్నారు. రెండేళ్లుగా చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారని, నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదని, సింగరేణి యాజ మాన్యం నిర్మాణాలు జరిగే చోట ఇప్పటి వరకు పనులు అసంపూర్తిగా ఉన్నాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో సింగరేణి సంస్థ నిధులతో సిమ్స్‌ మెడికల్‌ కాలేజీని నిర్మించామని, అందులో 5శాతం సీట్లు సింగరేణి కార్మికుల పిల్లలకే దక్కేలా చేశామని గుర్తు చేశారు. కార్మికుల క్వార్టర్లను కూల్చుతూ బలవంతంగా వారిని ఖాళీ చేయిస్తున్నారని ఆయన అన్నారు. సింగరేణి ఆస్తులపై సీఎండీ తక్షణమే స్పందించి బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు మిర్యాల రాజిరెడ్డి, కౌశిక హరి, నూనె కొమురయ్య, మురళీధర్‌రావు, మాదాసు రామమూర్తి, హరీష్‌రెడ్డి, సంతోష్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2026 | 12:25 AM