మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న సింగరేణి
ABN , Publish Date - Nov 23 , 2026 | 11:58 PM
సింగరేణి కార్మిక వాడలకు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయకపోవడం ద్వారా యాజమాన్యం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న దని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదా సి రామమూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య విమర్శించారు.
గోదావరిఖని, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మిక వాడలకు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయకపోవడం ద్వారా యాజమాన్యం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న దని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదా సి రామమూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య విమర్శించారు. గోదావరి నది నుంచి సరఫరా చేస్తున్న తాగు నీటిని సోమ వారం టీబీజీకేఎస్ ప్రతినిధి బృందం పరిశీలిం చింది. వారు మాట్లాడుతూ గోదావరిఖని పారి శ్రామిక ప్రాంతంలోని డ్రైనేజీ నీటిని మల్కా పురం నుంచి గోదావరి నదిలోకి విడిచిపెడు తున్నారని, వాటిని కార్మిక వాడలకు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. గోదావరి నదిలో యాజమాన్యం నిర్మించిన బావులకు పైభాగంలో డ్రైనేజీ నీరు గోదావరి నదిలో కలుస్తున్నదని పేర్కొన్నారు. నదిలో బావులకు పై భాగంలో నీటి ప్రవాహానికి అడ్డంగా కట్టడం నిర్మించాల్సి ఉన్నదని, నదిలో ఏర్పాటుచేసిన బావుల చుట్టూ మైక్రో సిమెంట్ పనులు సాంకేతికంగా చేయా ల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఇంది రమ్మ ఇళ్ల పేరిట ఇసుక దోపిడీ దర్జాగా చేస్తు న్నారన్నారు. డ్రైనేజీ నీరు నేరు గా నదిలోని బావుల్లోకి చేరు తున్నాయని, వాటిని గంగా నగర్ వద్ద ఉన్న ఫిల్టర్ బెడ్‌కు పంపిస్తున్నారని పేర్కొన్నారు. యైుటింక్లయిన్‌కాలనీ, సెంటి నరీ కాలనీ వాసులకు భూగ ర్భ గనులు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులోని ఆయిల్ గ్రీస్ పేలుడు పదార్థాల రసాయనా లతో కూడిన నీటిని సరఫరా చేస్తు న్నారన్నారు. అధికారులకు ప్రత్యేక ఫిల్టర్ బెడ్ ఏర్పాటుచేసి నీటి సరఫరా చేస్తున్నారని, ఇది వివక్ష కాదా అని ప్రశ్నించారు. స్వచ్ఛమైన తాగు నీటి కోసం దశలవారీగా ఆందోళనలు చేస్తామని పేర్కొన్నారు. పర్లపల్లి రవి, వడ్డేపల్లి శంకర్ నాగెల్లి సాంబయ్య, సత్యం, బేతి చంద్రయ్య, సంపత్ రెడ్డి, చల్లా రవీందర్‌రెడ్డి, దూటా శేష గిరి, దేవ శ్రీనివాస్ పాల్గొన్నారు.