Share News

సింగరేణి బకాయిలను వెంటనే చెల్లించాలి

ABN , Publish Date - Mar 22 , 2026 | 11:23 PM

సింగరేణి సంస్థకు రావాల్సిన రూ.51వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, కొత్త గనులు ప్రారంభించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ బాల్‌రాజ్‌, సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌ కుమార్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు.

సింగరేణి బకాయిలను వెంటనే చెల్లించాలి

గోదావరిఖని, మార్చి 22(ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థకు రావాల్సిన రూ.51వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, కొత్త గనులు ప్రారంభించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ బాల్‌రాజ్‌, సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌ కుమార్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. ఆదివారం గోదావరిఖని చౌరస్తాలో జరిగిన సేవ్‌ సింగరేణి పోరు జాత కార్నర్‌ మీటింగ్‌లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. సింగరేణిలో కార్మికుల పెండింగ్‌ సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం వైఫల్యం చెందిందని ఆరోపించారు. ముఖ్యంగా సింగరేణిలో రాజకీయ జోక్యం వల్ల కొత్త గనులు రావడం లేదని, ఉన్న గనులు మూసివేతకు దగ్గరలో ఉన్నాయని, వెంటనే కొత్త గనులను ప్రారంభించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి రావాల్సిన రూ.51వేల కోట్ల బకాయిలను చెల్లించాలని, ఏసీబీ విచారణ పేరుతో నిలిపివేసిన మెడికల్‌ బోర్డును నిర్వహించాలని వారు డిమాండ్‌ చేశారు. మారుపేర్లు, విజిలెన్స్‌ కేసుల కార్మికుల డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. సింగరేణి యాజమాన్యం ఏఐటీయూసీతో జరిపిన స్ట్రక్చర్‌ కమిటీ సమావేశాల్లో ఒప్పుకున్న డిమాండ్లను అమలు చేయకుండా యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కాంట్రాక్టు కార్మికులకు హైపవర్‌ కమిటీ వేతనాలు అమలు చేయాలని తదితర డిమాండ్‌లపై సింగరేణి వ్యాప్తంగా ఈనెల 30వరకు ఏఐటీయూసీ సేవ్‌ సింగరేణి పోరు జాతను నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఏప్రిల్‌లో సమ్మెకు పిలుపునిస్తామని వారు హెచ్చరించారు. భాస్కర్‌రావు భవన్‌ నుంచి ప్రధాన రోడ్డు మీదుగా చౌరస్తా వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ప్రజానాట్యమండలి కళాకారులు కన్నం లక్ష్మీనారాయణ, లెనిన్‌, మోహన్‌, జాలిగం రాజు, రాంచందర్‌, చంద్ర మోహన్‌ గేయాలు ఆలపించారు. ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్నర్‌ మీటింగ్‌లో నాయకులు వీరభద్రం, వైవీ రావు, ముస్కె సమ్మయ్య, కవ్వంపల్లి స్వామి, బాజీసైదా, కనకరాజు, సూర్య, సంకె అశోక్‌, మాదన మహేష్‌, రంగు శ్రీను, ఎంఏ గౌస్‌, విజయలక్ష్మి, ఓదెమ్మ పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2026 | 11:23 PM