Share News

షాపుల అగ్రిమెంట్లు.. లబ్ధిదారుల్లో ఆనందం

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:53 PM

పెద్దపల్లి ప్రభు త్వ జూనియర్‌ కళాశాల కాంప్లెక్స్‌లో దుకాణాలు నిర్వ హిస్తున్న 26 మంది షాపు యజమానులకు వారి సొంత పేర్లపై అగ్రిమెంట్లు చేయించడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

షాపుల అగ్రిమెంట్లు.. లబ్ధిదారుల్లో ఆనందం

పెద్దపల్లి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి ప్రభు త్వ జూనియర్‌ కళాశాల కాంప్లెక్స్‌లో దుకాణాలు నిర్వ హిస్తున్న 26 మంది షాపు యజమానులకు వారి సొంత పేర్లపై అగ్రిమెంట్లు చేయించడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో చొరవ చూపిన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయ రమ ణారావును కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు భూతగడ్డ సంపత్‌ ఆధ్వర్యంలో ఆదివారం విప్‌ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కాంప్లెక్స్‌లోని దుకాణాలు దాదాపు మూడు దశాబ్దా లుగా పలువురి చేతులు మారుతున్నాయి. దుకాణాలు నిర్వహిస్తున్న వారికి వ్యాపారంపై పూర్తిస్థాయి భరోసా లేకుండా పోయింది. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వ విప్‌ చొరవ తీసుకుని స్వయంగా దుకాణాలు నిర్వహి స్తున్న 26 మంది లబ్ధిదారుల పేర్లపై అగ్రిమెంట్లు చేయించేలా చర్యలు తీసుకున్నారు. తమ పేర్లపై అగ్రి మెంట్లు రావడం వల్ల దుకాణాల నిర్వహణపై భరోసా ఏర్పడిందని లబ్ధిదారులు పేర్కొన్నారు. ఏళ్ల తరబడి దుకాణాలను నిర్వహిస్తూ జీవనో పాధి పొందుతున్న తమకు ఇది సంతోషాన్ని కలిగించే పరిణామ మని తెలిపారు. ప్రభుత్వ విప్‌ విజయ రమణారావు మాట్లాడు తూ.. ప్రజల జీవనోపాధికి సంబంఽ దించిన సమస్యలను పరిష్కరిం చేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. దుకాణదారులకు న్యాయం జరిగేలా అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. దుకా ణదారులు అభిలాష్‌, ఫారుక్‌, విష్ణు, ఆంజనేయులు, సుభాన్‌, ఓదెలు, వికాస్‌, రాజు, శేఖర్‌, కుమార్‌, ఉమేష్‌, సురేష్‌, చంద్రమౌళి, రషీద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 11:53 PM