రేపు కలెక్టరేట్ ఎదుట గొర్లకాపరుల ధర్నా
ABN , Publish Date - Mar 21 , 2026 | 11:48 PM
జిల్లాలోని గొర్రెకాపరుల హక్కులు, ఆత్మగౌరవం, మార్కెట్ స్థలాల రక్షణ కోసం ఈ నెల 23న కలెక్టరేట్ ఎదుట గొంగడి ధర్నా నిర్వహించనున్నట్లు గొర్రెలకాపరుల సంక్షేమ సంఘం నాయకులు ప్రకటించారు.
పెద్దపల్లి కల్చరల్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గొర్రెకాపరుల హక్కులు, ఆత్మగౌరవం, మార్కెట్ స్థలాల రక్షణ కోసం ఈ నెల 23న కలెక్టరేట్ ఎదుట గొంగడి ధర్నా నిర్వహించనున్నట్లు గొర్రెలకాపరుల సంక్షేమ సంఘం నాయకులు ప్రకటించారు. పెద్దపల్లిలోని సంఘ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్, జిల్లా అధ్యక్షుడు సలేంద్ర రాములు, మారం తిరుపతి యాదవ్, ప్రధాన కార్యదర్శి మేకల నర్సయ్య యాదవ్ మాట్లాడుతూ జీవనోపాఽధిని, మార్కెట్ స్థలాలను కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటమన్నారు. గొంగడి ధర్నాకు యాదవులు, కురుములు, గొర్రె కాపరులు సంప్రదాయ గొంగడి ధరించి తరలివచ్చి ఐక్యతను చాటిచెప్పాలన్నారు. అనంతరం గొంగడి ధర్నా ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. నర్ల అంజయ్య యాదవ్, దాడి చంద్రమౌళి యాదవ్, బత్తిని లక్ష్మన్ యాదవ్ పాల్గొన్నారు.