Share News

కలెక్టరేట్‌ ఎదుట గొర్రెకాపరుల ధర్నా

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:42 PM

గొర్రెకాపరుల సమస్యలు పరిష్కరించాలని కాపరులు సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ ఎదుట సోమవారం గొర్రె కాపరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గొంగడి ధర్నా నిర్వహించారు. గొర్రెల కాపరులు సంప్రదాయ గొంగడి ధరించి కలెక్టరేట్‌ చేరుకొని ఆందోళనలో పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ ఎదుట గొర్రెకాపరుల ధర్నా

పెద్దపల్లిటౌన్‌, మార్చి 23 (ఆంఽధ్రజ్యోతి): గొర్రెకాపరుల సమస్యలు పరిష్కరించాలని కాపరులు సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ ఎదుట సోమవారం గొర్రె కాపరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గొంగడి ధర్నా నిర్వహించారు. గొర్రెల కాపరులు సంప్రదాయ గొంగడి ధరించి కలెక్టరేట్‌ చేరుకొని ఆందోళనలో పాల్గొన్నారు. సంఘం నాయకులు మాట్లాడుతూ మార్కెట్‌ స్థలాల పరిరక్షణ, గొర్రెల పెంపకానికి సంబంధించిన సబ్సిడీలు, పశు వైద్య సేవల విస్తరణ వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్‌ చేశారు. గొర్రె కాపరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సలేంద్ర రాములు అధ్యక్షతన జరిగిన గొంగడి ధర్నాకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలారపు పర్వతాలు యాదవ్‌ మాట్లాడారు. గొర్రె కాపరులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మార్కెట్‌ యార్డుల అభివృద్ధి, పశు వైద్య సేవలు, ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని గొర్రెలు, మేకల మార్కెట్‌ యార్డ్‌ స్థలాలకు వెంటనే సరిహద్దు రాళ్లు వేయాలన్నారు. జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తాత రాజు యాదవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల నర్సయ్య యాదవ్‌, నాయకులు దాడి చంద్రమౌళి యాదవ్‌, వేల్పుల రామ్మూర్తి యాదవ్‌, తాత సదానందం, తమ్మినవేణి కొమరయ్య, అట్ల లక్ష్మయ్య, నూనేటి సంపత్‌యాదవ్‌, ఆవుల లత, రాములు యాదవ్‌, ఎలుక కొమురయ్య యాదవ్‌, బత్తిని లక్ష్మణ్‌ యాదవ్‌, ఆసరి రాయమల్లు యాదవ్‌, పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 11:42 PM