సివిల్ సమస్యలు కోర్టులో తేల్చుకోండి
ABN , Publish Date - Jul 07 , 2026 | 11:44 PM
సివిల్ సమస్యలపై ప్రజలు పోలీస్‌స్టేష న్లను ఆశ్రయించవద్దని, వాటిని కోర్టుల పరిధిలో పరిష్కరించుకోవాలని డీసీపీ రాం రెడ్డి సూచించారు. మంగళవారం పోలీస్ స్టేషన్‌ను ఏసీపీ జి.కృష్ణ, సీఐ కె.ప్రవీణ్‌కు మార్‌తో కలిసి సందర్శించారు.
ధర్మారం, జూలై 7 (ఆంధ్రజ్యోతి): సివిల్ సమస్యలపై ప్రజలు పోలీస్‌స్టేష న్లను ఆశ్రయించవద్దని, వాటిని కోర్టుల పరిధిలో పరిష్కరించుకోవాలని డీసీపీ రాం రెడ్డి సూచించారు. మంగళవారం పోలీస్ స్టేషన్‌ను ఏసీపీ జి.కృష్ణ, సీఐ కె.ప్రవీణ్‌కు మార్‌తో కలిసి సందర్శించారు. రిసెప్షన్ గదిని సందర్శించి ఫిర్యాదుల నమోదు ప్రక్రియను పరిశీలించి సూచనలు చేశారు. డీసీపీ విలేకరులతో మాట్లాడుతూ సివిల్ సమస్యలు గ్రామ స్థాయిలోనే పరిష్కరిం చుకోవాలని, లేనిపక్షంలో కోర్టులను ఆశ్ర యించాలని చెప్పారు. సివిల్ వ్యవహారాల్లో అనవసరంగా పోలీసులను లాగొద్దని ప్రజలకు సూచించారు. డ్రగ్స్ నిర్మూలనకు డివిజన్ పరిధిలో పోలీసులు చేస్తున్న అవగాహన కార్యక్రమాలు ఫలిస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలీసులు గ్రామ స్థాయిలో చేస్తున్న కృషితో ప్రజలు మత్తు పదార్ధాల వల్ల జరిగే అనర్థాలను తెలుకుంటున్నారన్నారు. డ్రగ్ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, వారి నడవడికను గమనిం చా లని సూచించారు. సీసీ కెమెరాలు అమ ర్చుటకు ప్రజలు ముందుకు రావాలన్నారు.