సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యతతో సేవలందించాలి
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:19 AM
సీనియర్ సిటిజన్లు పోలీస్ స్టేషన్లకు వచ్చినపుడు వారికి ప్రాధాన్యం ఇచ్చి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డీసీపీ రాంరెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల వేడుకల్లో సీనియర్ సివిల్ జడ్జి శ్రీనిజ కోయిర్కర్‌తో కలిసి డీసీపీ పాల్గొన్నారు.
పెద్దపల్లి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): సీనియర్ సిటిజన్లు పోలీస్ స్టేషన్లకు వచ్చినపుడు వారికి ప్రాధాన్యం ఇచ్చి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డీసీపీ రాంరెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల వేడుకల్లో సీనియర్ సివిల్ జడ్జి శ్రీనిజ కోయిర్కర్‌తో కలిసి డీసీపీ పాల్గొన్నారు. డీసీపీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లకు వచ్చే సీనియర్ సిటిజన్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కలెక్టర్ దృష్టికి వచ్చే వృద్ధుల సమస్యలకు సానుకూలంగా స్పందిస్తూ సకాలంలో పరిష్కారం చూపేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని అన్నారు. సీనియర్ సిటిజన్స్ చట్టాన్ని ఉపయోగించి పిల్లల పేరున రిజిస్ట్రేషన్ చేసిన భూములను రద్దు చేసి, తిరిగి తల్లిదండ్రుల కలెక్టర్ చొరవతో రిజిస్ర్టేషన్లు చేశారన్నారు. వృద్ధులను గౌరవించే కుటుంబాలు మంచి ఫలితాలను పొందుతాయని తెలిపారు. అనాథలు లేదా ఆదరణ లేని వృద్ధులు కనిపిస్తే వారిని గుర్తించి సుల్తానాబాద్‌లో ప్రభుత్వ వృద్ధాశ్రమానికి తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వయోవృద్ధులను సన్మానించారు. సెర్ప్ డైరెక్టర్ కృష్ణమూర్తి, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి కాళిందిని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వై. పవిత్ర, కలెక్టరేట్ పరిపాలన అధికారి బండి ప్రకాష్, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్, రిటైర్డ్ జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, రిటైర్డ్ బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, వయోవృద్ధులు, పాల్గొన్నారు.