కల్యాణం.. కమనీయం...
ABN , Publish Date - Mar 27 , 2026 | 11:30 PM
గోదావరిఖని కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేదమంత్రోచ్ఛారణల మధ్య కల్యాణాన్ని వేలాది మంది భక్తజనం కన్నులారా వీక్షించారు. జైశ్రీరాం నామస్మరణలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగింది.
పెద్దపల్లి కల్చరల్, మార్చి27(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో సీతారా ముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. శాంతి నగర్ కోదండ రామాలయంలో ఎమ్మెల్యే విజ యరమణరావు, మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్ల య్య పట్టువస్ర్తాలు సమర్పించారు. అమర్ నగర్‌లోని వెంకటేశ్వర దేవాలయం, తెనుగు వాడలోని హనుమాన్ మందిర్‌లో జరిగిన వేడు కల్లో కౌన్సిలర్ కొలిపాక సంపత్, వెంకటేశ్వర ఆలయంలో మాజీ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు జరిగాయి.
కోల్‌సిటీటౌన్, (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేదమంత్రోచ్ఛారణల మధ్య కల్యాణాన్ని వేలాది మంది భక్తజనం కన్నులారా వీక్షించారు. జైశ్రీరాం నామస్మరణలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగింది. ఆలయ ప్రధాన అర్చకులు మధుసూధనాచార్యులు, అర్చకులు గిరిధరాచార్యులు, శశిధరాచార్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్-మనాలీ ఠాకూర్ దంపతులు, మేయర్ మహాంకాళి స్వామి దంపతులు పట్టువస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియో జకవర్గ ప్రజలపై సీతారామచంద్రస్వామి ఆశీ స్సులుండాలన్నారు. మన సంస్కృతి సంప్రదా యాలను గౌరవిస్తూ ముందుకుసాగాలన్నారు. ఎస్‌సీ జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాం చందర్, సింగరేణి ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్ దంపతులు, ఏసీపీ రమేష్, వన్‌టౌన్ సీఐలు ఇంద్రసేనారెడ్డి దర్శించుకున్నారు. ఏసీపీ మడత రమేష్ పర్యవేక్షణలో వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనా రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
అంతర్గాం, (ఆంధ్రజ్యోతి): గోలివాడలోని కల్యా ణ వేడుకల్లో ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాకూర్ పట్టువస్ర్తాలు తీసుకువచ్చారు. రామ గుండంలోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్‌తోపాటు కార్పొరేటర్లు పాల్గొన్నారు. రాముని గుండాల కొండపై జరిగిన వేడుకల్లో డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ మడత రమేష్‌లు ప్రత్యేక పూజలు చేశారు. పలు గ్రామా ల్లో జరిగిన వేడుకల్లో అల్ర్టా టేక్ సిమెంట్ కర్మా గారం అధ్యక్షుడు కౌశికహరి, బీజేపీ నియోజక వర్గం ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి పోచంలు పాల్గొన్నారు. రామగుండం రైల్వే స్టేషన్‌లోని షిరి డి సాయిబాబా మందిరంలో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించారు.
ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): రాములపల్లి నాగ లింగేశ్వర స్వామి, ఎలిగేడు, సుల్తాన్‌పూర్, ధూళికట్ట, ముప్పిరితోట, లాలపల్లి, నర్సాపూర్ గ్రామాల్లోని ఆలయాల్లో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు సుల్తాన్‌పూర్‌లో సీతారాముల ఎదురుకోళ్లలో పాల్గొని స్వామి వారి పల్లకీని మోశారు.
మంథని, (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పలు ఆలయాల్లో సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తు లు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అయ్యప్ప స్వామి ఆలయంలో వొడ్నాల శ్రీనివాస్-ప్రవళిక, కొమురవెల్లి విజయ్‌కుమార్-సునీత దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించారు. అయ్యప్ప స్వామి, రాంనగర్‌లోని రామాలయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీనుబాబు పూజలు నిర్వహించారు. రచ్చపల్లి ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు శైలజలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల్లో సీతారాముల కల్యాణ వేడుకలను నిర్వహించారు.
ధర్మారం, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో శ్రీరామ నవమి వేడుకల్లో రాష్ట్ర సాంఘిక సం క్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మన్‌కుమార్ పా ల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి పూస్కూరి జితేందర్‌రావు, పద్మలు స్వాగతం పలి కారు. కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్దఎ త్తున తరలివచ్చారు. ఏఎంసీ చైర్మెన్ లావుడ్య రూప్లానాయక్, ఉదయ్‌కుమార్, పాలకుర్తి రాజే శం, కొత్త నర్సింహులు చింతల ప్రదీప్‌రెడ్డి, కాంపెల్లి రాజేశం, వెంకటేశం పాల్గొన్నారు.
ఓదెల, (ఆంధ్రజ్యోతి): భ్రమరాంబ మల్లికా ర్జున స్వామి క్షేత్రంలో అర్చకులు ఆరుట్ల శ్రీని వాసచార్యులు, నరసింహాచార్యుల ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహిం చారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజ యరమణారావు సతీమణి పావని పట్టు వస్త్రాల ను సమర్పించారు. గ్రామ పంచాయతీ ఆధ్వ ర్యంలో సర్పంచ్ కనికిరెడ్డి సతీష్ వార్ఢు సభ్యులు పట్టు వస్త్రాలను సమర్పించారు.