బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రత చర్యలు చేపట్టాలి
ABN , Publish Date - Oct 13 , 2026 | 12:10 AM
బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రత చర్యలు చేప ట్టాలని, ప్రతీ బ్యాంకు ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డ్, సీసీ కెమెరాలు, అలారం సిస్టంను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా బ్యాంకుల అధికారులకు, పోలీస్ సిబ్బం దికి సూచించారు.
కోల్‌సిటీ, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రత చర్యలు చేప ట్టాలని, ప్రతీ బ్యాంకు ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డ్, సీసీ కెమెరాలు, అలారం సిస్టంను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా బ్యాంకుల అధికారులకు, పోలీస్ సిబ్బం దికి సూచించారు. సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌ల ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, వివిధ బ్యాంకుల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆర్థిక నేరాల నివారణ, గతంలో జరిగిన బ్యాంకు ఏటీఎం, నేరాలు, భవిష్యత్‌లో తీసుకోవాల్సిన భద్రత చర్యల పై చర్చించారు. ఆయన మాట్లాడుతూ ఏటీఎం వద్ద భద్రత ప్రమా ణాలు పాటించాలని సూచించారు. 24గంటలు సెక్యూరిటీ గార్డ్, సీసీ కెమె రాలు, అలారం సిస్టం ఏర్పాటు చేసుకోవాలని, కొన్ని బ్యాంకుల ఏటీ ఎంలలో నాణ్యత లేని సీసీ కెమెరాలు ఉండడం, సెక్యూరిటీ గార్డ్‌లు లేక పోవడాన్ని గుర్తించినట్టు చెప్పారు. డీవీఆర్‌లను బహిరంగంగా కనిపిం చకుండా సురక్షితమైన, రహస్య ప్రదేశాల్లో భధ్రపరచాలని, బ్యాంకు లోపల, బయట పరిసర ప్రాంతాల్లో అనుమానస్పద వ్యక్తులు, వాహనాల కదలికలు, వారి ప్రవర్తనను సెక్యూరిటీ గార్డులు నిరంతరం గమనించా లని ఆదేశించారు. సెక్యూరిటీ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఏటీఎంలో నగదు నింపే సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే భద్రతను మరింత పటిష్టం చేస్తారన్నారు. బ్యాంకు సిబ్బందికి తమ పరిధిలోని పోలీస్‌స్టేషన్ అధికారుల ఫోన్ నెంబర్లు తెలిసి ఉండాలని, హెల్ప్‌లైన్, పోలీస్‌స్టేషన్ నెంబర్లను స్పష్టంగా కనిపించే విధంగా బ్యాంకుల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనుమానం వచ్చిన వ్యక్తులపై నిఘా ఉంచాలని సూచించారు. బ్యాంకులు, ఏంటీఎంల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని ఆదేశించారు. అడిషనల్ డీసీపీ(అడ్మిన్) కే శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేందర్, ఏసీపీలు రమేష్, ప్రకాష్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, కృష్ణకుమార్, ప్రమోద్‌రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సీసీఎస్ ఎస్‌ఐలు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.