Share News

త్వరలో రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

ABN , Publish Date - Jun 01 , 2026 | 11:30 PM

త్వరలో రాష్ట్రంలో రెండో దశ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌ మండలం భూపతిపూర్‌లో నిర్మాణాలు పూర్తి చేసు కున్న ఇందిరమ్మ ఇండ్లను సోమవారం అధికారులు లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు.

త్వరలో రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

సుల్తానాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): త్వరలో రాష్ట్రంలో రెండో దశ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌ మండలం భూపతిపూర్‌లో నిర్మాణాలు పూర్తి చేసు కున్న ఇందిరమ్మ ఇండ్లను సోమవారం అధికారులు లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లా డుతు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట మేరకు అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నా మన్నారు. పదేండ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలకు అన్యాయం చేసిందన్నారు. ఈ నెలలో రెండో దశ ఇం దిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమం కూడా జరుగు తుందని, ప్రతీ నియోజకవర్గానికి 1500 నుంచి 2000 లోపు వచ్చే ఇండ్లను అర్హులైన అందరికీ మంజూరు చేస్తామని చెప్పారు. సొంత ఇంటి నిర్మాణాలకు లబ్ధి దారులకు ఐదు లక్షలు ఇచ్చిన ఘనత దేశంలో సీఎం రేవంత్‌రెడ్డిదేనన్నారు. గతంలో అసంపూర్తిగా నిర్మా ణం పూర్తి చేసుకున్న వారికి కూడా ఈసారి అవకా శం కల్పిస్తున్నామని, పేదలు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలన్నారు. సుల్తానాబాద్‌ మండలం లో మొదటి దశలో 770 ఇండ్లు మంజూరు కాగా వాటిలో 200 ఇండ్లు నిర్మాణాలు ప్రారంభించక పోవడంతో అధికారులు వాటిని రద్దు చేశారన్నారు. ఇప్పటి వరకు 140 ఇండ్లు నిర్మాణాలు పూర్తి చేసు కోగా మిగిలినవి 90 శాతం పురోగతిలో ఉన్నాయన్నారు. మార్కెట్‌ చైర్మన్‌ ప్రకాశ్‌ రావు, సర్పంచులు, నాయకులు అఽధికారులు పాల్గొన్నారు.

పాలకుర్తి, (ఆంధ్రజ్యోతి): పాలకుర్తి మండల కేంద్రంతో పాటు బసంత్‌నగర్‌, కొత్తపల్లి, రామరావు పల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్య క్రమాల్లో సోమవారం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రతీ పేద కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేయా లనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథ కాన్ని ప్రారంభించి అమలు చేస్తుందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు గౌరవప్రదమైన జీవనం గడపడానికి ఇలాంటి సంక్షేమ పథకాలు ఎంతో దోహ దపడుతాయన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతీ కుటుంబానికి ప్రభు త్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో అనేక కు టుంబాలు శాశ్వత నివాస సౌకర్యాన్ని పొందుతున్నా యని, భవిష్యత్తులో ప్రజా సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలను చేపడుతామని ఎమ్మెల్యే తెలిపారు. సర్పంచ్‌లు పెద్దపల్లి తిరుమల, పర్షవేణి శ్రీనివాస్‌ యాదవ్‌,తోట స్వప్న,అన్నం లక్ష్మి, తహసీల్దార్‌ జె సునీత, మండల వ్యవసాయాఽధికారి బండి ప్రమోద్‌, ఎంపీవో ఉప్పు సుదర్శన్‌, రామగుండం మార్కెట్‌ కమిటి చైర్మన్‌ గడ్డం తిరుపతి,కన్నాల పిఎసిఎస్‌ చైర్మన్‌ బయ్యపు మనోహర్‌ రెడ్డి, మాజీ ఎంపీపీ గంగాధరి రమేష్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్‌ గౌడ్‌, పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2026 | 11:30 PM