స్కూల్ బస్సు డ్రైవర్లు భద్రత నియమాలు పాటించాలి
ABN , Publish Date - Jun 17 , 2026 | 11:50 PM
పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సుల డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలని గోదావరిఖని ఏసీపీ రమేష్ అన్నారు. గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలోని పలు స్కూళ్లు, కళాశాలల యజమానులు, బస్ డ్రైవర్లకు ఎన్టీపీసీ మిలీనియం హాల్‌లో అవగాహన సదస్సును నిర్వహించారు.
జ్యోతినగర్, జూన్17(ఆంధ్రజ్యోతి): పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సుల డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలని గోదావరిఖని ఏసీపీ రమేష్ అన్నారు. గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలోని పలు స్కూళ్లు, కళాశాలల యజమానులు, బస్ డ్రైవర్లకు ఎన్టీపీసీ మిలీనియం హాల్‌లో అవగాహన సదస్సును నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ యాజమాన్యం నైపుణ్యం కలిగిన డ్రైవర్లను నియమించుకోవాలని సూచించారు. పిల్లలు ఎక్కే సమయం, దించేటప్పుడు నిర్దేశించిన ప్రదేశాల్లో బస్సులను నిలపాలని అన్నారు. డ్రైవర్లు ఓవర్ టేకింగ్, మద్యం సేవించడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డ్రైవర్లు ఏ తప్పు చేసినా స్కూల్ యాజమాన్యాలదే బాధ్యతన్నారు. సీఐ కృష్ణకుమార్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ రెడ్డి, ఎన్టీపీసీ ఎస్‌ఐ ఉదయ్ కిరణ్, రామగుండం ఎస్‌ఐ సంధ్యారాణి, రామగిరి ఎస్‌ఐ శ్రీనివాస్, ముత్తారం ఎస్‌ఐ రవి కుమార్‌తోపాటు స్కూళ్ల, కళాశాలల యజమానులు, ప్రిన్సిపాళ్లు, డ్రైవర్లు పాల్గొన్నారు.