పారిశుధ్య కార్మికులకు సన్మానం, ఆరోగ్య పరీక్షలు
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:53 PM
మండలంలోని కొత్తపల్లి, చీకురాయి, కాసులపల్లితోపాటు పలు గ్రామాల్లో 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఆదివారం మల్లీపర్పస్ విధానంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను సర్పంచ్‌లు సన్మానించారు. కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
పెద్దపల్లి రూరల్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొత్తపల్లి, చీకురాయి, కాసులపల్లితోపాటు పలు గ్రామాల్లో 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఆదివారం మల్లీపర్పస్ విధానంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను సర్పంచ్‌లు సన్మానించారు. కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సర్పంచ్‌లు పెర్క రిబ్కా, ఓదెల శ్రీనివాస్, గద్దల రాజ శేఖర్, ఉప సర్పంచ్ బాలసాని ప్రవీణ్, కార్యదర్శులు శంకరయ్య, పాషతో వార్డు సభ్యులు పాల్గొన్నారు. పెద్దకల్వల గ్రామ పంచాయతీ కార్యాల యంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిం చారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేసి నట్లు సర్పంచ్ నర్ల కనుకమ్మ-పోల్ రాజు అన్నారు. ఉప సర్పంచ్ పర్స లక్ష్మీ-శంకర్, పంచాయతీ కార్యదర్శి శ్రావణ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్, (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామ పంచా యతీ కార్యాలయాల్లో పని చేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గర్రెపల్లి పంచాయతీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి పంచాయతీ అధికారి దేవకీ దేవి, సర్పంచ్ వీరగోని రమేష్‌గౌడ్‌లు నిత్యావసర వస్తువులను అందజే శారు. ఇన్‌చార్జి డీపీఓ మాట్లాడుతు జిల్లా వ్యాప్తంగా వర్కర్లకు సరుకుల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సుద్దాలలో సర్పంచ్ సంపత్, ఉప సర్పంచ్ వెంకటేశ్, వార్డుసభ్యులు అందజేశారు. సిబ్బందిని సన్మానించారు.
జూలపల్లి, (ఆంధ్రజ్యోతి): జూలపల్లి మండల కేంద్రంతోపాటు బాల్ రాజ్‌పల్లి, పలు ఆయా గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను సన్మానించారు. వారికి నిత్యావసర సరుకులను అందజేసారు. సర్పంచులు, కార్యదర్శులు ఉపసర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ముత్తారం, (ఆంధ్రజ్యోతి): గ్రామ పరిశుభ్రతలో సిబ్బంది పాత్ర కీలక మని సర్పంచ్ చిలివేరి జ్యోతి లక్ష్మణ్ అన్నారు. మచ్చుపేటలో గ్రామ పం చాయతీ సిబ్బందిని సన్మానించారు. కార్యదర్శి లక్ష్మణ్ బాబు, సభ్యులు కళావేనా దేవరాజు, సాగర్, దుండే జ్యోతి రాణి, మదాసి వనజ ఉన్నారు. పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి డాక్టర్ అమరేందర్‌రావు తెలిపారు. ముత్తారం, అడవి శ్రీరాంపూర్ గ్రామ పంచాయతీ వర్కర్లకు వైద్య పరీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి రక్త నమూనాలను సేకరించారు. కార్మికులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, స్టాఫ్‌నర్స్ నరసమ్మ, మహిళా ఆరోగ్య కార్యకర్త స్రవంతి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దొంతి రెడ్డి లలిత రెడ్డి పాల్గొన్నారు.
ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీ కార్మికుల ఆరోగ్య పరిరక్ష ణ ప్రజాప్రతినిధుల బాధ్యత అని సర్పంచ్‌లు కప్పల ప్రవీణ్, పల్లెర్ల వెంక టేష్, మద్దెల రమాదేవి అన్నారు. నర్సాపూర్, ఎలిగేడు, ర్యాకల్‌దేవుపల్లి గ్రామాల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు యూనిఫామ్, నిత్యావసర సరుకులను పంపిణీ చేసి సన్మానించారు. నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు వారు పేర్కొన్నారు. ఉపసర్పంచ్‌లు ముంజం నరేష్, గోసిక రవీందర్, కృష్ణ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
అంతర్గాం, (ఆంధ్రజ్యోతి): ఆకేనపల్లి గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు యూనిఫాం, నిత్యావసర సరుకులను సర్పంచ్ గాదె స్రవంతి సుధాకర్ అందజేశారు. పలువురు సర్పంచ్‌ను శాలువాలతో సన్మానించారు. సభ్యులు సాగర్, మల్లమ్మ, పద్మ, కవిత, కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.